IPL 2022 : CSKకు బిగ్ షాక్.. గాయం కారణంగా అంబటి రాయుడు ఔట్ !

-

ఐపీఎల్ 2022 సీజన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు అస్సలు వచ్చి రావడం లేదు. ఆడిన అన్ని మ్యాచ్ల్లోనూ కేవలం రెండు మాత్రమే గెలిసి పాయింట్స్ టేబుల్ లో కింది నుంచి రెండో స్థానంలో నిలిచింది చెన్నై. అయితే ఈ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ కు మరో షాక్ తగిలింది. మిడిల్ ఆర్డర్ లో రాణిస్తున్న అంబటి రాయుడు గాయపడ్డాడు.

పంజాబ్ కింగ్స్ ఫైనల్ మ్యాచ్ సమయానికి అంబటి రాయుడు గాయపడ్డాడు. చేతిపై గాయమైంది. ఆదాయంతోనే అంబటి రాయుడు బ్యాటింగ్ చేశాడు. పంజాబ్కింగ్స్ నిర్దేశించిన 188 పరుగుల లక్ష్యాన్ని అందుకునే క్రమంలో అంబటిరాయుడు అద్భుతంగా ఆడిన విషయం తెలిసిందే.

39 బంతుల్లో 79 పరుగులు సాధించాడు. ముందుగా బ్యాటింగ్ చేయడం కారణంగా గాయం మరింత తీవ్రతరం అయింది. చర్మం పై వాపు అలాగే పొక్కులతో అతను బాధపడుతున్నాడు. అయితే అంబటి రాయుడు కి వారం రోజుల పాటు రెస్ట్ అవసరమని వైద్య నిపుణులు చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ ఆడే మరో మూడు మ్యాచ్లకు.. అంబటి రాయుడు దూరం కానున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news