దేశానికి ప్రత్యామ్నాయ రాజకీయ కూటమికాదు.. ప్రత్యామ్నాయ ఎజెండా కావాలి: కేసీఆర్

-

బీజేపీని గద్దె దించేందుకు అన్ని పార్టీలు కలిసికట్టుగా పనిచేయాలని తనను కమ్యూనిస్ట్ పార్టీలు కోరాయని..అది చెత్త ఎజెండా నేను మీతో రాను అని చెప్పానని కేసీఆర్ అన్నాడు. దేశానికి కావాల్సింది ప్రత్యామ్నాయ రాజకీయ కూటమి కాదని… ప్రత్యామ్నాయ ఎజెండా కావాలని ఆయన అన్నారు. గద్దెనెక్కించాల్సింది భారతదేశ ప్రజలనని.. పార్టీలను కాదని కేసీఆర్ అన్నారు. రిలీఫ్ కావాల్సింది ప్రజలుకు పార్టీలకు కాదని…మారాల్సింది ప్రభుత్వాలు కాదు, ప్రజల జీవితాలు అని కేసీఆర్ తెలిపారు. ఎవరినో గద్దెనెక్కించడానికి… దించడానికి ప్రయత్నాలు జరగాలా.? అంటూ ప్రశ్నించారు. దేశం బాగుపడటానికి మన రాష్ట్రం వేదికైతే అది మనందరికీ గర్వకారణం అని కేసీఆర్ అన్నారు. దేశాన్ని సరైన పంథాలో నడిపించేందుకు ఓ కొత్త ప్రతిపాదన, ఎజెండా సిద్ధమైతే మన రాష్ట్రానికి, దేశానికి గర్వకారణం అని అన్నారు. నలుగురు ముఖ్యమంత్రులను ఒకటి చేయడం..గుంపు కట్టడం కాదని ప్రత్యామ్నాయ ఎజెండా కోసం వెతకాలి అని అన్నాడు. నూతన వ్యవసాయ, పారిశ్రామిక విధానం కావాలని కేసీఆర్ కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news