ఏప్రిల్ 5 నాటికి అంబేడ్కర్‌ విగ్రహం సిద్ధమవ్వాలి : మంత్రి ప్రశాంత్‌రెడ్డి

-

‘ఏప్రిల్ 5 లోగా అంబేడ్కర్‌ విగ్రహ నిర్మాణ పనులు పూర్తి చేయాలని ఇంజినీర్లకు రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సూచించారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా.. వచ్చే నెల 14న అట్టహాసంగా ప్రారంభోత్సవం చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించిన విషయం తెలిసిందే. అన్ని పనులు ముందస్తుగా పూర్తి చేయాలని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అధికారులకు, గుత్తేదారు ప్రతినిధులకు స్పష్టం చేశారు.

హైదరాబాద్​లోని హుస్సేన్‌సాగర్‌ సమీపంలో 125 అడుగుల ఎత్తున డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహాన్ని ప్రభుత్వం నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఆ పనులను మంత్రి వేముల పరిశీలించారు. నిర్మాణ తీరుతెన్నులపై అధికారులు, గుత్తేదారు ప్రతినిధులతో సమీక్షించారు.

‘‘తెలంగాణ రాష్ట్ర గౌరవం పెరిగిలే ప్రాంగణాన్ని రూపొందించాలి. నిర్మాణ పనులు వేగం పెరగాలి. అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలి. రోజు వారీగా పనులను సమీక్షిస్తామ’ని’ ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. మంత్రి వెంట ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌ ఫ్రొఫెసర్‌ లింబాద్రి, ఆర్‌ అండ్‌ బి ఇంజినీర్‌-ఇన్‌-చీఫ్‌ ఐ.గణపతిరెడ్డి, అధికారులు హఫీజుద్దీన్‌, లింగారెడ్డి, రవీంద్రమోహన్‌, గుత్తేదారు ప్రతినిధులు అనిల్‌, కొండల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news