భారత్ గడ్డపై అడుగు పెట్టిన ట్రంప్ ఘన స్వాగతం ,ఇవే హైలైట్స్

-

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత పర్యటన నేపధ్యంలో తొలిసారి భారత గడ్డపై అడుగుపెట్టారు. అహ్మదాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆయనకు ప్రధాని నరేంద్ర మోడీ సహా గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాని ఘన స్వాగతం పలికారు. ట్రంప్ తో పాటుగా భార్య మెలానియా, కుమార్తె ఇవాంకా, అల్లుడు జారెద్ కుష్ణర్ అడుగు పెట్టారు. దీనితో ఎక్కడిక్కడ పటిష్ట భద్రతను ఏర్పాటు చేసారు అధికారులు.

విమానాశ్రయం నుంచి నేరుగా సబర్మతి ఆశ్రమానికి వెళ్ళారు ట్రంప్ దంపతులు. భారతీయ సాంప్రదాయం నృత్యాలతో ఆయనకు స్వాగతం పలికారు. మోడీ ఈ సందర్భంగా ట్రంప్ ని ఆలింగం చేసుకున్నారు. భారీ కాన్వాయ్ తో ట్రంప్ సబర్మతి ఆశ్రమానికి వెళ్తున్నారు. మోతెరా స్టేడియం లో నమస్తే ట్రంప్ కార్యక్రమం జరగనుంది. రోడ్డు పొడవునా భారీ ఎత్తున ప్రజలు ట్రంప్ కి స్వాగతం పలికారు.

ఇక మోతెరా స్టేడియం లో కూడా ఆయనకు అదే విధంగా స్వాగత౦ పలకడానికి గాను ఏర్పాట్లు చేసారు. ఆయన సాయంత్రం 5 గంటలకు తాజ్ మహల్ సందర్శన కోసం ఆగ్రా వెళ్తారు. భార్య మెలానియా తో కలిసి ఆయన తాజ్ మహాల్ ని సందర్శించనున్నారు. మోతెరా స్టేడియానికి పలువురు సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. అహ్మదాబాద్ లో భారీ ఎత్తున హోర్డింగ్ లు ఏర్పాటు చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news