మోడీ భజన కోసం అంత దూరం నుంచి వచ్చిన ట్రంప్…!

-

సాధారణంగా అమెరికా అధ్యక్షులు ఎవరు వచ్చినా సరే ఇప్పటి వరకు చూసిన దాని ప్రకారం విన్న దాని ప్రకార౦ విపక్షాల నేతలతో సమావేశం అవుతూ ఉంటారు. పర్యటన తొలి రోజు అయినా రెండో రోజు అయినా సరే విపక్షాల నేతలతో సమావేశం కావడం మనం ఇప్పటి వరకు చూస్తూ వచ్చాం. ఇప్పటి వరకు భారత పర్యటనకు వచ్చిన ఏ అమెరికా అధ్యక్షుడు అయినా సరే వాళ్ళను కలవడం ఒక ఆనవాయితీ.

ఎంత ప్రధాని స్వాగతం పలికినా, ఎంత మరొకరు స్వాగతం పలికినా సరే విపక్షాల నేతలతో సమావేశం నిర్వహిస్తారు. వారి అభిప్రాయాలను, రాజకీయ పరిస్థితులను, దేశంలో ఉన్న పరిస్థితులను అడిగి తెలుసుకుంటారు. కాని ఇక్కడ మాత్రం అలాంటిది ఏమీ జరగలేదు. గతంలో వచ్చిన అమెరికా అధ్యక్షులు జార్జ్ బుష్, బిల్ క్లింటన్, బరాక్ ఒబామా ఇలా వచ్చిన వాళ్ళు అందరూ విపక్షాల నేతలతో ఒక సమావేశం నిర్వహించారు.

కాని ట్రంప్ పర్యటన షెడ్యుల్ లో విపక్షాలతో సమావేశం అనే ప్రస్తావన లేకుండా పోయింది. నమస్తే ట్రంప్ కార్యక్రమంలో భాగంగా మోడి భజన చేయడానికే ఆయన సమయం మొత్తం వెచ్చించారు. ట్రంప్ ప్రసంగంలో భారత్ అమెరికా సంబంధాలు, మోడీ చేస్తున్న పనులు మినహా ఏ ఒక్కటి ట్రంప్ ప్రస్తావించే ప్రయత్నం చేయలేదు. మోడీ టీ అమ్మి పైకి వచ్చిన విషయాన్ని అందరికి వినపడే విధంగా అరచి చెప్పారు. నవంబర్ లో జరిగే అధ్యక్ష ఎన్నికల కోసం ట్రంప్ ఈ టూర్ కి వచ్చారు.

ప్రవాస భారతీయుల ఓట్ల కోసం ట్రంప్ అడుగుపెట్టారు. హెచ్ 1 బి వీసాల గురించి ఒక్క మాట కూడా ట్రంప్ మాట్లాడిన పాపాన పోలేదు. మోడీ వచ్చిన తర్వాతే దేశంలో విజయాలు అనేవి మొదలయ్యాయి అన్నట్టు మోడీ భజన చేసారు. 8 వేల మైళ్ళ నుంచి వచ్చా అని చెప్పిన ట్రంప్… 8 వేల మైళ్ళ నుంచి వచ్చి మోడీ భజన చేసారు. ఇక్కడ ఇంకో కామెడీ ఏంటీ అంటే ఢిల్లీలో ఎర్ర కోటను సందర్శించలేదు. అది కూడా లేదు. కేవలం బిజెపి పాలిత రాష్ట్రాల్లో మాత్రమే ఆయన పర్యటించడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news