జెలెన్‌స్కీకి ప్రధాని మోదీ ఫోన్‌.. అమెరికా రియాక్షన్ ఏంటంటే..?

-

రష్యా కొనసాగిస్తున్న యుద్ధంతో అతలాకుతలమైపోయిన ఉక్రెయిన్ కు ప్రపంచ దేశాలు మద్దతు ప్రకటిస్తున్నాయి. ఓవైపు ఉక్రెయిన్ కు అంతర్జాతీయ సమాజం మద్దతునిస్తోంటే.. మరోవైపు రష్యా ఒంటరిదై పోతోందని అగ్రరాజ్యం అమెరికా వ్యాఖ్యానించింది. ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న యుద్ధం వల్ల ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ ఒంటరి వారవుతున్నారని పేర్కొంది.

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి ప్రధాని మోదీ కాల్‌ చేయడాన్ని ఈ సందర్భంగా అమెరికా ప్రస్తావించింది. మంగళవారం రోజున జెలెన్‌స్కీకి ఫోన్ చేసిన మోదీ.. ఉక్రెయిన్‌ యుద్ధానికి సైనిక పరమైన పరిష్కారం లేదన్నారు. చర్చలు, దౌత్యం ద్వారా యుద్ధానికి సాధ్యమైనంత త్వరగా ముగింపు పలకడానికి ప్రయత్నం జరగాలని ఇది వరకే తాను పిలుపునిచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. శాంతిని నెలకొల్పే ఎలాంటి చర్యల్లోనైనా సాయపడేందుకు భారత్‌ సిద్ధమని తెలిపారు.

దీనిపై శ్వేతసౌధ ప్రెస్ సెక్రటరీ స్పందించారు. ‘ఉక్రెయిన్ యుద్ధంపై బహిరంగంగా స్పందించాలని, దౌత్యపరంగా చర్చించాలని ప్రపంచ దేశాలను మేం కోరుతూనే ఉన్నాం. ఇప్పుడు భారత ప్రధాని నుంచి వచ్చిన స్పందన ఆ తరహాలోనిదే అని మేం భావిస్తున్నాం’ అని చెప్పారు. ‘పుతిన్‌తో భారత ప్రధాని నేరుగా చేసిన వ్యాఖ్యలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఇది యుద్ధాల యుగం కాదన్నారు. ఇది పుతిన్‌ యుద్ధమని పరోక్షంగా ప్రస్తావించారు కూడా.’ అని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news