అమెరికా అధ్యక్షుడి నివాసం వైట్ హౌస్ ట్విట్టర్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అధ్యక్షుడు రామ్ నాథ్ కోవింద్, ప్రధానమంత్రి కార్యాలయం (పిఎంఓ) ను ట్విట్టర్ లో అన్ ఫాలో చేసింది. ట్విట్టర్ లో ఫాలో చేసిన మూడు వారాల తర్వాత అన్ ఫాలో చేసింది. వైట్ హౌస్ ట్విట్టర్ హ్యాండిల్‌లో 21 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. వైట్ హౌస్ 19 మందిని ట్విట్టర్ లో ఫాలో అయింది.
వాటిల్లో భారత్ కి చెందిన ఖాతాలు ఏమీ లేవు. అదే విధంగా అమెరికాలోని భారత రాయబార కార్యాలయంని కూడా ఫాలో చేయలేదు. మూడు వారాల వారాల క్రితం, అమెరికా అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ఫాలో చేసిన ఏకైక ప్రధానిగా మోడీ నిలవడం గమనార్హం. హైడ్రాక్సీ క్లోరోక్విన్ ని అమెరికాకు అందించిన తర్వాత రెండు దేశాల అధినేతల మధ్య సానుకూల వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే.
ఏప్రిల్ 8 న ఒక ట్వీట్‌లో ట్రంప్ మాట్లాడుతూ, హైడ్రాక్సీక్లోరోక్విన్‌తో అమెరికాకు సహాయం చేయాలన్న ప్రధాని మోదీ చేసిన ఆలోచనను మరిచిపోలేం అంటూ పేర్కొన్నారు “అసాధారణ సమయాలలో స్నేహితుల మధ్య మరింత సహకారం అవసరం. హెచ్‌సిక్యూపై నిర్ణయం తీసుకున్నందుకు భారతదేశానికి మరియు భారత ప్రజలకు ధన్యవాదాలు. దీన్ని తాము మరచిపోలేము. మానవత్వంతో ఆలోచించి సాయం చేసిన మోడికి ధన్యవాదాలు.