75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు అమెరికాకు చెందిన ప్రసిద్ధ అమెరికన్ సింగర్ మేరీ మిల్‌బెన్ రానున్నారు. గతంలో ‘ఓం జయ్ జగదీశ హరే’, ‘జనగణమన’ గీతాలు పాడి మేరీ మిల్‌బెన్ భారతీయుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. అలాగే భారత స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా గతంలో పలుసార్లు ఆమె గీతాలు పాడారు. ఈ క్రమంలో ఆమెకు కేంద్ర ప్రభుత్వం ఆహ్వానం పంపింది.
ఢిల్లీలో ఆగస్టు 15న నిర్వహించనున్న స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమంలో మేరీ మిల్‌బెల్ పాల్గొంటారు. భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు అమెరికా కళాకారులకు ఆహ్వానం రావడం ఇదే మొట్టమొదటిసారి. భారత్ నుంచి తనకు ఆహ్వానం అందడం చాలా సంతోషంగా ఉందని మిల్‌బన్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. అమెరికా నుంచి కల్చరర్ అంబాసిడర్‌గా భారత్‌కు వెళ్తున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ నెల 10న ఇండియాస్పోరా గ్లోబల్ ఫోరమ్‌లో మేరీ భారత గీతాన్ని పాడతారు. ఈ కార్యక్రమంలో తమిళనాడుకు చెందిన పియానో కళాకారుడు లిడియన్ కూడా పాల్గొననున్నారు.
Honoring the flag honors the country. A special day, for a special land, for a special people.
Jai Hind, India. #HarGharTiranga @AmritMahotsav #AmritMahotsav #AzadiKaAmritMahotsav #IndiaAt75 pic.twitter.com/Tqcuf4XPoA— Mary Millben (@MaryMillben) August 2, 2022