అమీనాపూర్ అత్యాచార కేసుని పోలీసులు చేధించారు. గురువారం సాయంత్రం వెలుగులోకి వచ్చిన అత్యాచారం కేసుపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు సంచలన విషయాలు బయటపెట్టారు. ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ సందీప్ తో కలిసి సినిమాకు వెళ్లిందని, ఇంట్లో తెలిస్తే తిడతారు అని చెప్పి రేప్ డ్రామా ఆడిందని ఎస్పీ చెప్పారు. అసలు ఆ బాలికపై అత్యాచారం జరగలేదని స్పష్టం చేసారు. సీసీ టీవీలో బాలిక ఉన్న దృశ్యాలను పోలీసులు విడుదల చేసారు.
ఆమె ఉంటున్న ఇంటి యజమాని, బాయ్ ఫ్రెండ్ సందీప్ పై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసారు. ఈ కేసులో ముందు నుంచి పోలీసులు అనేక అనుమానాలను వ్యక్తం చేస్తూనే ఉన్నారు. గురువారం సాయంత్రమే బాలికకు పోలీసులు వైద్య పరిక్షలు చేయించగా ఆమెపై అత్యాచారం జరగలేదని ఒక స్పష్టమైన నిర్ధారణకు వచ్చేశారు.
ఆ తర్వాత కేసుపై విచారణలో భాగంగా పోలీసులు ఒక కీలక వ్యాఖ్య చేసారు. ఘటన జరిగిన పరిధిలో పవర్ హాలిడే కారణంగా సీసీ కెమెరాలు పని చేయలేదని పోలీసులు పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం కూడా పోలీసులు అదే మాట చెప్పారు. ఇక ఇప్పుడు ఆమె దుస్తుల ఆధారంగా సినిమాకు వెళ్లినట్టు మరో ప్రాంతంలో సీసీ టీవీ ఫూటేజ్ ఆధారంగా పోలీసులు గుర్తించారు.