‘డిస్కో రాజా’ కూడా మాస్ రాజా ఫేట్ మార్చలేకపోయిందిగా…..!!

-

టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ హీరోగా ప్రస్తుతం తెరకెక్కిన తాజా సినిమా డిస్కో రాజా నేడు ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. సైన్స్ ఫిక్షన్ చిత్రాల దర్శకుడైన విఐ ఆనంద్ దర్శకత్వంలో ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామ్ తాళ్లూరి నిర్మించిన ఈ సినిమాలో రవితేజ సరసన పాయల్ రాజ్ పుత్, నభా నటేష్, తాన్య హోప్ హీరోయిన్లుగా నటించారు. ఎన్నో అంచనాల మధ్య నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాపై చాలావరకు కేవలం యావరేజ్ టాక్ వినపడుతోంది. తన గత సినిమాల మాదిరిగా దర్శకుడు ఆనంద్ ఈ సినిమాకు కూడా ఒక సైన్స్ ఫిక్షన్ కథాంశాన్ని ఎంచుకోవటం జరిగిందని, అయితే దానిని పూర్తిస్థాయిలో ప్రేక్షకుడికి కనెక్ట్ అయ్యేలా తీయడంలో మాత్రం ఆయన చాలావరకు విఫలం అయ్యాడని అంటున్నారు.

Ravi Teja disco raja Movie review
Ravi Teja disco raja Movie review

ఇక ఈ సినిమా ఫస్ట్ షో నుండి అందుతున్న సమాచారాన్ని బట్టి సినిమా ఫస్టాఫ్ మొత్తం మంచి ఎంటర్టైనింగ్ గా సాగుతూ, అక్కడక్కడా వచ్చే కొన్ని ట్విస్టులతో పరవాలేదనిపించేలా ముందుకు సాగుతుందని, అయితే ఇంటర్వెల్ ఎపిసోడ్ మాత్రం అదిరిపోతుందని, దానితో సెకండాఫ్ పై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి ఏర్పడుతుందని అంటున్నారు. ఇక ఒకింత మెల్లగా మొదలయ్యే సెకండాఫ్, మధ్య మధ్యలో ల్యాగ్స్ తో, అలానే కొన్ని బోరింగ్ సీన్స్ తో ముందుకు సాగుతుందని, ఇక సినిమాలో వచ్చే ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్స్ మాత్రం బాగున్నాయని అంటున్నారు.

 

ఓవరాల్ గా ఏ మాత్రం ఆకట్టుకోని సైన్స్ ఫిక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో రవితేజ మార్క్ యాక్షన్, ఎంటర్టైన్మెంట్, ఫైట్స్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్, ఇంటర్వెల్ ఎపిసోడ్, అలానే క్లైమాక్స్ వంటివి మాత్రం ప్లస్ పాయింట్స్ అని చెప్తున్నారు. హీరోయిన్స్ క్యారెక్టర్లు పెద్డగా ఆకట్టుకోకపోవడం, రోత్త రొటీన్ గా సాగె సెకండ్ హాఫ్ లో చాలా వరకు మైనస్ లు, ఉండడం, అలానే వెన్నెల కిషోర్ తో రవితేజ చేసే ఫోర్స్డ్ కామెడీ సీన్స్ వంటివి ఈ సినిమాకు పెద్ద మైనస్ లుగా చెప్తున్నారు. కాగా వరుసగా గత మూడు సినిమాలతో ఫెయిల్యూర్స్ చవిచూసిన రవితేజకు ఇది ఏమాత్రం కం బ్యాక్ ని అందించే మూవీ కానేకాదని తేల్చేస్తున్నారు. మరి మున్ముందు ఈ సినిమా ఎంత మేర కలెక్షన్స్ సాధిస్తుందో చూడాలి….!!

Read more RELATED
Recommended to you

Latest news