భావోద్వేగాల సమాహారం ఆమిర్ ఖాన్ ‘లాల్ సింగ్ చద్దా’..ట్రైలర్‌లో నాగచైతన్య డిఫరెంట్ లుక్

-

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్‌ఖాన్‌ హీరోగా అద్వైత్‌ చందన్‌ దర్శకత్వంలో రూపొందిన హిందీ చిత్రం ‘లాల్‌సింగ్‌ చద్దా’. మోస్ట్ అవెయిటెడ్ ఫిల్మ్ ‘లాల్ సింగ్ చద్దా’ ట్రైలర్ ను తాజాగా మేకర్స్ రిలీజ్ చేశారు. బ్యూటిఫుల్ హీరోయిన్ కరీనా కపూర్‌ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య ఓ కీలక పాత్రలో నటించారు.

Ameerkhan lal singh Chaddha shooting at andhrapradesh
Ameerkhan lal singh Chaddha shooting at andhrapradesh

‘ఎక్స్‌పీరియన్స్‌ది ఎక్స్‌ట్రార్డినరీ జర్నీ ఆఫ్‌ ఏ సింపుల్‌మేన్‌’ అంటూ ‘లాల్‌ సింగ్‌ చద్దా’ హిందీ ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్‌. ఇప్పటికే పోస్టర్లు, పాటలతో సినిమాపై అంచనాలను భారీగా పెరిగాయి. ఈ క్రమంలోనే టీ20 ఫైనల్‌ మ్యాచ్‌లో ఈ ట్రైలర్‌ను ప్రదర్శించిన మేకర్స్..తాజాగా సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు.

ట్రైలర్ చూస్తుంటే సినిమా భావోద్వేగాల సమాహారంగా ఉండబోతున్నదని స్పష్టమవుతోంది. ట్రైలర్‌లో ఆమీర్‌ ఖాన్, నాగ చైతన్య లుక్‌ కొత్తగా ఉంది. ఈ మూవీ హిందీతోపాటు దక్షిణాది భాషల్లో ఆగస్టు 11న విడుదల కానుంది. అమిర్‌ ఖాన్‌ ప్రొడక్షన్స్‌, వయాకామ్‌ 18 స్టూడియోస్‌ సంయుక్తంగా ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశాయి. ఈ మూవీ ఆస్కార్‌ విన్నింగ్‌ ఫిల్మ్‌ ‘ఫారెస్ట్‌గంప్‌’కు అఫీషియల్ హిందీ రీమేక్‌.

Read more RELATED
Recommended to you

Latest news