ఆర్మీ అభ్యర్ధుల అల్లర్లపై స్పందించిన అమిత్ షా..ఎవరూ ఆందోళన చెందవద్దు !

-

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఇవాళ ఉదయం నుంచి ఆర్మీ అభ్యర్థులు ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ సంఘటనపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా.. స్పందించారు. దేశ వ్యాప్తంగా ఆర్మీ అభ్యర్ధుల అల్లర్లపై స్పందించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. గత రెండేళ్ళలో, కరోనా మహమ్మారి కారణంగా సైన్యంలో నియామక ప్రక్రియ ప్రభావితమైందని పేర్కొన్నారు.

ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ‘అగ్నీపథ్ యోజన’లో, ఆ యువకుల ప్రయోజనాలను సంరక్షిస్తూ, అభ్యర్ధుల వయోపరిమితిలో రెండేళ్ల రాయితీని ఇచ్చారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న వయోపరిమితి ని 21 ఏళ్ల నుంచి 23 ఏళ్లుగా మార్చేందుకు సున్నితమైన నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు అమిత్‌ షా. ఈ నిర్ణయం ద్వారా పెద్ద సంఖ్యలో యువత ప్రయోజనం పొందుతారని మరియు అగ్నిపథ్ పథకం ద్వారా వారు దేశానికి సేవ చేసే దిశలో ముందుకు సాగుతారని ఆయన వెల్లడించారు. దీనిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news