‘అగ్నిపథ్’ సరైంది కాదు.. పాత విధానాన్నే కొనసాగించాలి – కేంద్రంపై రేవంత్ ఫైర్

-

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఇవాళ ఉదయం నుంచి ఆర్మీ అభ్యర్థులు ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ సంఘటనపై కాంగ్రెస్‌ పీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి.. స్పందించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఈ రోజు జరిగిన ఘటన దురదృష్టకరమన్నారు.

మోడీ ప్రభుత్వం ఆర్మీ విద్యార్థుల మనోభావాలకు భిన్నంగా చేసిన నిర్ణయ ఫలితం ఇదని పేర్కొన్నారు. దేశభక్తితో సైన్యంలో చేరడానికి సిద్ధపడిన యువత ఇంతలా ఆందోళనకు దిగారంటే ‘అగ్నిపథ్’ సరైనది కాదని ప్రభుత్వం,పాత విధానాన్నే కొనసాగించాలని డిమాండ్‌ చేశారు రేవంత్‌ రెడ్డి.

కాగా.. రైల్వే స్టేషన్‌ లో పరిస్థితి ఉద్రిక్తతంగా మారిపోయింది. అయితే.. ఆందోళనకారులు రెచ్చిపోవడంతో.. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ లో పరిస్థితి అదుపు తప్పింది. ఇక చేసేది ఏమీ లేక.. ఆందోళనకారులపై పోలీసులు కాల్పులు జరుపుతున్నారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు.. గాల్లో కాల్పులు జరుపుతున్నారు పోలీసులు. ఈ కాల్పుల్లో.. కొంత మంది ఆందోళన కారులకు తీవ్రంగా గాయాలు అయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news