తెలంగాణ, ఏపీ వరదలపై అమిత్‌ షా కీలక ఆదేశాలు !

-

తెలంగాణ, ఏపీ వరదలపై అమిత్‌ షా కీలక ఆదేశాలు జారీ చేశారు. గోదావరి నదికి వచ్చిన వరదల వలన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలోని ప్రజలకు, వారి జీవనోపాధికి జరిగిన నష్టం గురించి కేంద్ర హోంశాఖ మరియు సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా గారిని నేరుగా కలిసి వివరించారు కిషన్ రెడ్డి.

ఈ నేపథ్యంలోనే అమిత్ షా ఆయా ప్రాంతాలలో అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను వీలయినంత త్వరగా అందించమని మంత్రిత్వ శాఖను ఆదేశించారు. తెలంగాణలో అవసరమైన రెస్క్యూ & రిలీఫ్ ఆపరేషన్లను నిర్వర్తించడానికి ఇప్పటికే 13 NDRF బృందాలను పంపించారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన SDRF నిధులను కేటాయించినప్పటికీ, మొదటి విడత నిధులను విడుదల చేయడానికి అవసరమైన విజ్ఞాపణ పత్రాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకూ అందించలేదని… ఈ పత్రాలను పంపించిన వెంటనే అవసరమైన అన్ని రకాల సహకారాన్ని అందించటానికి భారత ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన మొదటి విడత నిధులను NDRF నుండి ఇప్పటికే విడుదల చేయడం జరిగిందని.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజ్ఞప్తి చేసిన వెంటనే రెండవ విడత నిధులకు సంబంధించిన కేటాయింపులు జరిపి, నిధులను విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి ప్రాథమిక నివేదిక అందిన వెంటనే కేంద్ర ప్రభుత్వ బృందాలను పంపి జరిగిన నష్టం అంచనా వేయడానికి సిద్ధంగా ఉన్నట్లుగా కూడా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news