అరుదైన ఫొటోలను పంచుకున్న అమితాబ్.. ఏమి రాశాడంటే..

-

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే బాలీవుడ్ స్టార్లలో అమితా బచ్చన్ ఒకరు. సమయం వచ్చినప్పుడల్లా తన కుటుంబ విషయాలను పంచుకుంటూ ఉంటారు. ఫొటోలను షేర్ చేస్తుంటారు. ఈరోజు అమితా బచ్చన్ తండ్రి హరివంశ్ రాయ్ బచ్చన్ 114వ జయంతి. ఈ సందర్భంగా తన తండ్రితో కలిసి ఉన్న అరుదైన చిత్రాన్ని తన అభిమానులతో పంచుకున్నారు బిగ్ బి. అలాగే, తన వివాహం సందర్భంగా తీసింది ఫొటోను కూడా షోషల్ మీడియాలో ఉంచారు. జయా బచ్చన్‌కు సింధూరం పెడుతూ ఉన్న సమయంలో క్లిక్‌మనిపించిన ఫొటో అది.

1973, జూన్ 3న జయా బమదురి(జయ బచ్చన్)‌ను అమితా బచ్చన్ వివాహం చేసుకున్నారు. ఆయన తల్లిదండ్రులు తేజీ బచ్చన్, హరివంశ్ బచ్చన్.

తన తండ్రి గురించి బిగ్ బి ఇలా రాసుకొచ్చారు. నా తండ్రే నాకు సరస్వం. 1907, నవంబర్ 27న ఆయన జన్మించారు. ఈరోజు నా తండ్రి 114వ జయంతి. ప్రస్తుతం ఆయన నా తల్లితోపాటు స్వర్గంలో ఉన్నారు. వారు అక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మేం ఇక్కడ చేసుకుంటున్నాం అంటూ గంభీరమైన వ్యాఖ్యలు రాశారు.

ఆ ఫొటోల గురించి అబితాబ్ ఇలా రాసుకొచ్చారు. ‘అయితే, తొలుత మన మధ్య దూరం తగ్గించాలకుంటున్నా. వీలైనంత వేగంగా. ఆ దూరం తగ్గించడానికి గాలులు సైతం వ్యతిరేకంగా పరుగెత్తే అరుదైన క్షణం ఇది. ప్రస్తుతం అమితాబ్ బచ్చన్ కోన్ బనేగా కరోడ్ పతి అనే క్విజ్ ప్రోగ్రామ్‌కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఇటీవల దేశ విద్యార్థుల కోసం స్పెషల్ వీక్‌లో భాగంగా స్కూల్ పిల్లలను కోన్ బనేగా కరోడ్ పతి ప్రోగ్రామ్‌కు ఇన్వైట్ చేశారు. అమితాబ్ తండ్రి హరవంశ్ బచ్చన ప్రముఖ కవి.

Read more RELATED
Recommended to you

Latest news