కరోనా కల్లోలం… టెక్ మహీంద్రా యూనివర్సిటీకి 15 రోజులు సెలవులు

-

చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి… ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ వైరస్ బారినపడి చాలామంది మృతి చెందారు. ఇక తాజాగా హైదరాబాద్ మేడ్చల్లోని టెక్ మహేంద్ర యూనివర్సిటీ లో కరోనా కల్లోలం సృష్టించింది. టెక్ మహేంద్ర యూనివర్సిటీలో ఏకంగా 15 మంది విద్యార్థులు అలాగే ఐదు మంది సిబ్బందికి కరోనా సోకింది.

దీంతో వైద్య అధికారులు చర్యలు చేపట్టారు. డి ఎం హెచ్ ఓ మల్లికార్జున వర్సిటీని పరిశీలించారు అధికారులు. ప్రస్తుతం హోం ఐసోలేషన్ లో 30 మంది కరోనా బాధితులు ఉన్నట్లు తెలిపారు అధికారులు. వర్సిటీ సిబ్బందికి సమీపంలోని దుకాణదారులకు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

అలాగే కరోనా నేపథ్యంలో వర్సిటీకి 15 రోజుల సెలవు ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు అధికారులు. అయితే పాజిటివ్ వచ్చిన వారంతా.. కరోనా వ్యాక్సిన్ రెండో కూడా వేసుకున్నట్లు సమాచారం అందుతోంది. దీంతో అందరిలోనూ టెన్షన్ మొద లైంది. కరోనా సోకిన నేపథ్యంలో అన్నీ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news