అమూల్ పాల ధరలు మరోసారి భారీగా పెరిగిపోయాయి. లీటరు పాల ధర అ రెండు రూపాయల చొప్పున పెంచుతున్నట్లు అమ్ములు బ్రాండ్ పేరుతో మార్కెటింగ్ చేసే గుజరాత్ ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ నిన్న ప్రకటన చేసింది. ఈ ప్రకటన ప్రకారం ఇవాల్టి నుంచి దేశవ్యాప్తంగా అన్ని మార్కెట్లలో పెరిగిన ధరలు అమలులోకి వచ్చాయి.
అమూల్ పాల ధర పెంపు అనంతరం… అహ్మదాబాద్ అలాగే సౌరాష్ట్ర లో అరలీటరు అమూల్ గోల్డ్ పాల ప్యాకెట్ ధర 30 రూపాయలకు చేరింది. అమూల్ తాజా ప్యాకెట్ ధర 24 రూపాయలు, అమూల్ శక్తి 20 రూపాయలు అయింది.
పాల ప్యాకెట్, రవాణా, పశుగ్రాసం ఖర్చులు పెరిగిన నేపథ్యంలో ఈ పెంపు నిర్ణయాన్ని తీసుకున్నట్లు గుజరాత్ మార్కెటింగ్ ఫెడరేషన్ పేర్కొంది. గత రెండు సంవత్సరాల్లో తాజా పాల ప్యాకెట్ ధర కేవలం 4 శాతం మేర మాత్రమే సవరించామని… ప్రస్తుత టెంపుల్ కూడా ఆహార ద్రవ్యోల్బణం కంటే తక్కువేనని స్పష్టం చేసింది ఫెడరేషన్. కాగా 2021 జూలైలో లీటరు పాలకు రెండు రూపాయల చొప్పున అమూల్ పెంచిన సంగతి తెలిసిందే.