మండే అంటే విద్యార్థుల నుంచి ఉద్యోగుల వరకు ఎవరికీ నచ్చదు. కానీ సోమవారాన్ని కూడా ఉత్సాహంగా మొదలుపెట్టేందుకు ప్రతి సోమవారం స్ఫూర్తిదాయక సందేశాలను పంచుకుంటారు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా. ఈ రోజు కూడా ఆయన ఓ మండే మోటివేషన్ షేర్ చేశారు. మరి నేటి స్ఫూర్తిదాయక సందేశం ఎవరి గురించో తెలుసా? ఇంకెవరు.. సాకర్ హీరో.. అర్జెంటీనాను విశ్వవిజేతగా నిలిపిన ఫుట్‌బాల్ మాంత్రికుడు లియొనెల్ మెస్సి గురించే. ఆదివారం నాటి ఉత్కంఠ భరిత ఫైనల్ పోరులో అర్జెంటీనాకు ఘనమైన విజయాన్ని అందించిన మెస్సిపై మహీంద్రా ప్రశంసలు కురిపించారు.
‘‘ఈ రోజు మండే మోటివేషన్ ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ నుంచి రాకుండా ఎలా ఉంటుంది? ఓ వ్యక్తికి అసాధారణ శక్తులు ఉంటే అతడిని మహా పురుషుడు అంటారు. మెస్సి.. తన అంకితభావం, కఠోర శ్రమతో అసాధారణ విజయాలు సాధించిన ఓ సాధారణ వ్యక్తి. మీరు కూడా మెస్సి (మహా పురుషుడు)లా ఉండండి’’ అని ఆనంద్ మహీంద్రా రాసుకొచ్చారు.
How could today’s #MondayMotivation not come from the #WorldCupFinal ? But the caption of this poster isn’t the message. A Messiah is seen as someone with extraordinary powers. Messi was an ordinary man who,with dedication & hard work did extraordinary things. Be your own Messiah pic.twitter.com/lWoQGybQnG
— anand mahindra (@anandmahindra) December 19, 2022
ఇక ‘‘ఈ సోమవారాన్ని గందరగోళంగా (Messy Monday) మొదలుపెట్టే బదులు దాన్ని ‘మెస్సీ మండే (Messi Monday) గా ఆరంభించండి’’ అని ఓ నెటిజన్ చేసిన ట్వీట్‌కు మహీంద్రా స్పందిస్తూ ‘సరిగ్గా చెప్పార’ని కితాబిచ్చారు.
— anand mahindra (@anandmahindra) December 19, 2022