Ananya Nagalla: స్లీవ్ లెస్ జాకెట్..వైట్ శారీలో పైట సర్దుకుంటూ చూపులతోనే అనన్య సైగలు!

-

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినీ రీ ఎంట్రీ మూవీ ‘వకీల్ సాబ్’ చిత్రంలో కీలక పాత్ర పోషించిన తెలుగమ్మాయి అనన్య నాగళ్ల..టాలీవుడ్ ఇండస్ట్రీకి ‘మల్లేశం’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. తన క్యూట్ లుక్స్ తో అందరినీ ఆకట్టుకున్న ఈ భామ సోషల్ మీడియా వేదికగా చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన లేటెస్ట్ ఫొటోలు, సినిమాల అప్ డేట్స్ షేర్ చేస్తుంటుంది.

ఇటీవల కోలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న చిత్రానికి సంబంధించిన విశేషాలను ఇన్ స్టా గ్రామ్ వేదికగా తెలిపింది అనన్య నాగళ్ల. తాజాగా ఇన్ స్టా గ్రామ్ వేదికగా చీర కట్టులో దిగిన పెయింటింగ్స్ లాంటి ఫొటోలును షేర్ చేసింది. సదరు ఫొటోలు చూసి నెటిజన్లు ‘పూల రంగు చీరలో అచ్చ తెలుగందాలు’ అదిరిపోయాయని అంటున్నారు.

పూల రంగు చీరలో అలా ఓ తలుపు వద్ద నిలుచుని రకరకాల ఫోజులిచ్చింది అనన్య. అలా చీర కట్టులో పైట సర్దుకుంటూ చూపులతోనే కైపెక్కించిన భామ.. చీరకట్టులో బ్యాక్ అందాలనూ చూపింది. స్లీవ్ లెస్ రవిక ధరించిన ఈ అమ్మడు..క్యూట్ లుక్స్ తో పిచ్చెక్కిస్తోంది. ‘సోక్యూట్, ఐ లవ్ యూ, మ్యాజికల్ కళ్లు, బాపు బొమ్మలాగా పెయింటింగ్ చేయబడ్డావ్’ అని నెటిజన్లు ఈ ఫొటోలు చూసి కామెంట్స్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version