సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో అరాచకం.. ఫ్రీ వైఫైను అందుకోసం వాడేస్తున్న జనాలు..!

-

మారుతున్న కాలం.. పెరుగుతున్న టెక్నాలజీ.. వెరసీ టీనేజ్‌లోనే చెడు అలవాట్లకు దగ్గరవుతున్న యువత. ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని మంచికోసం వాడితే.. ఎన్నో లాభాలు ఉంటాయి.. కానీ చాలమంది ఇంటర్నెట్‌ను చెడు ప్రయోజనాల కోసమే వాడుతున్నారు. సైబర్‌ నేరాలు మితిమీరిపోతున్నాయి. ఆన్‌లైన్‌ క్లాసుల కోసం ఫోన్‌ కొనిచ్చి డేటా బ్యాలెన్స్‌ యాడ్‌ చేసి మీ పిల్లలకు ఫోన్‌ ఇచ్చేశారు. వాళ్లు అందులో ఏం చూస్తున్నారో ఎవరికి ఎరుక.. సరే ఆ విషయం పక్కన పెట్టండి.. అరే రైల్వేస్టేషన్‌కు ఎంతోమంది హడావిడిగా వస్తారు. ట్రైన్‌ టికెట్‌ బుక్‌ చేసుకోవాలి.. ఫోన్లో నెట్‌ ఉందో లేదో అని.. రైల్వేశాఖ.. ఫ్రీ వైఫై ఫెసిలిటీ ఏర్పాటు చేసింది. అయితే కొందరు ఈ నెట్‌ను దుర్వినియోగం చేస్తున్నారు. మనలో కూడా చాలామంది.. రైల్వేస్టేషన్‌లో వైఫై వాడి మూవీస్‌ డౌన్లోడ్‌ చేసుకుంటారు.. కానీ కొందరు ఇంకాస్త ముందుకెళ్లి.. ఏకంగా వాటినే డౌన్లోడ్‌లో పెట్టేశారండోయ్.. ఏంటి అర్థంకాలేదా..!

దేశంలోనే.. అధికంగా తెలంగాణ రాష్ట్రంలోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉచిత వైఫైను వాడి పోర్న్‌ వీడియోస్‌ డౌన్లోడ్‌ చేస్తున్నారట. రైల్వేశాఖ ప్రయాణికుల సౌకర్యం కోసం దేశంలోని సుమారు 6100 రైల్వే స్టేషన్‌లలో ఉచిత వైఫై సేవలను అందిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లోనూ.. పలు రైల్వే స్టేషన్‌లలో ఉచిత వైఫై సేవలు అందుబాటులో ఉన్నాయి. వీటిని రైల్‌ టెల్‌ నిర్వహిస్తోంది. అయితే ఫ్రీ వైఫై ఎలా వాడుకుంటున్నారు.. ఎంతమేరకు ప్రయాణికులకు ఉపయోగపడుతుందని.. రైల్ టెల్ అధికారులు ఆరా తీశారు. అలా ఈ దారణమైన విషయం వెలుగులోకి వచ్చింది. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఫ్రీ వైఫై ద్వారా 35శాతం మంది అశ్లీల వీడియోలు చూస్తున్నట్టుగా తేలింది. తర్వాత స్థానంలో నాంపల్లి, ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి రైల్వే స్టేషన్‌లో కూడా ఇదే తరహాలో ఉచిత వైఫై సేవలు వాడుతున్నారట.

ప్రయాణికుల సౌకర్యం కోసం ఇండియన్‌ రైల్వే ఉచిత వైఫై సేవలు అందిస్తోంది. రైల్వే స్టేషన్‌లలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని రైళ్ల సమాచారం, ఫ్లాట్‌ఫామ్‌ సమాచారం, ఆన్‌లైన్ టికెట్‌ బుకింగ్ లాంటి సేవల కోసం ఉచిత వైఫైని అందిస్తోంది. ఇలా వేలాది రైల్వే స్టేషన్‌లలో ఫ్రీ వైఫై ఉంది. సరిగా వాడుకునే ప్రయాణికులకు ఇది ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. కానీ కొంతమంది ఇలా అరాచకం చేస్తున్నారు. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే.. ఇలా డౌన్లోడ్‌ చేసే వాళ్లు.. రైల్వే ప్రయాణికులా.. లేక పోకిరిగాళ్లా అనేది తెలియాల్సి ఉంది. ఫ్యామిలితో ఊర్లకు వెళ్లేవాళ్లు.. రైల్వే స్టేషన్‌లో ఇలాంటి వ్యాపారం పెట్టుకోరు.. ఏ పనిలేని వాళ్లే.. రైల్వే స్టేషన్‌కు వచ్చి.. ఇలా పోర్న్ వీడియోస్‌ డౌన్‌లౌడ్‌ చేసుకుని పోతున్నారనేది కొందరి అభిప్రాయం. ఏదైతేనేం..వైఫై సేవలు దుర్వినియోగం కాకుండా.. పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు.

– Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news