అనసూయ భరద్వాజ్..బుల్లితెర నుంచి ఏ టైంలో వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చిందో తెలియదు. కానీ, ఆమె ఎంట్రీ ఇచ్చిన నాటి నుంచి ఫుల్ బిజీ ఆర్టిస్ట్ అయిపోయింది. ఓ వైపు టెలివిజన్ మరో వైపు సినిమాలు ఇలా రెండిటినీ బ్యాలెన్స్ చూస్తూ దూసుకుపోతున్నది. క్రేజీ ప్రాజెక్ట్స్ లో కీ రోల్స్ ప్లే చేస్తూనే లీడ్ రోల్ ప్లే చేసే స్థాయికి ఎదిగింది ఈ భామ.
‘దర్జా’ చిత్రంలో లేడీ డాన్ రోల్ ప్లే చేస్తున్న అనసూయ భరద్వాజ్.. స్టార్ హీరోల చిత్రాల్లో కీలక పాత్రలూ పోషిస్తోంది. ఇక ఈ భామ సోషల్ మీడియాలో షేర్ చేసే పోస్టుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈమె షేర్ చేసే ప్రతీ పోస్టు నెట్టింట దాదాపుగా చర్చనీయాంశమవుతుంటుంది. తాజాగా ఈ భామ ఇన్ స్టా గ్రామ్ వేదికగా నీలి రంగు చీరలో దిగిన ఫొటోలను షేర్ చేస్తూ అందానికి నయా అర్థం చెప్పింది.
అందం అంటే బయటకు కనిపించేది కాదని, ఆ అమ్మాయి సాధించిన విజయాలు, పంచిన ప్రేమ, ఆత్మవిశ్వాసం అనే క్యాప్షన్ తో అనసూయ ఫొటోలు షేర్ చేసింది. సదరు ఫొటోల్లో అనసూయ కిల్లింగ్ లుక్స్ తో చంపేసింది. సంప్రదాయానికి ప్రతీక అయిన చీరకట్టులోనూ సెగలు రేపుతోంది.
నీలి రంగుపూల చీరలో, లేత నీలి రంగు రవిక ధరించి అలా తన నడుము అందాలు, బరువెక్కిన పరువాలు చూపించి చూపించక కవ్విస్తోంది అనసూయ. ఇక ఈ ఫొటోలు చూసి నెటిజన్లు రెచ్చిపోతున్నారు.
‘హాట్ క్వీన్ ఇన్ ద వరల్డ్, క్వీన్, లవ్ యూ, బ్యూటిఫుల్, వావ్ సూపర్బ్, బ్లూ ఈ జ్ సూటెబుల్ ఫర్ యూ’ అని కామెంట్స్ చేస్తున్నారు. ఈ భామ నటించిన ‘ఆచార్య’ చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది. ‘రంగమార్తాండ, పక్కా కమర్షియల్’ సినిమాల్లోనూ ఈ సుందరి కీ రోల్ ప్లే చేస్తోంది.
https://www.instagram.com/p/CcUev_yrN7Y/