యాంకర్ అనసూయ టార్గెట్ చేసేది వారినేనా ..!!

ఈ రోజుల్లొ కొద్దిగా ఫేమ్ ఉన్న వారిని టార్గెట్ చేయడం సులభంగా మారింది. వారి ఫొటోస్ మార్ఫింగ్ చేసి అసభ్యంగా మార్చి అశ్లీల వెబ్సైట్లు లో పెట్టడం వ్యాపారం గా మారింది. అవగాహన లేని వారు ఇది నిజమే అని నమ్మి అట్టి వారిపై చెడు అభిప్రాయం ఏర్పరుచుకునే అవకాశం ఉంది. ఇక రీసెంట్ గా హాట్ యాంకర్ అనసూయ పిర్యాదు తో అలాంటి సైబర్ నేరగాన్ని పోలీసులు అరెస్టు చేయడం జరిగింది.

వివరాల్లోకి వెళితే కొంత మంది అనసూయ ఫోటో పెట్టి పూర్తి నగ్నంగా, అర్ధనగ్నంగా మార్చి వివిధ వెబ్సైట్లు లో పెట్టారు.ఇది గమనించిన అనసూయ గతంలో పోలీసుల కు పిర్యాదు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు అనసూయ మరో సారి తనని ఇబ్బంది పెడుతున్న వారిపై బాణం ఎక్కుపెట్టెలా ఉందని తెలుస్తోంది.

రీసెంట్ పోస్ట్ లో దాక్కున్న పాపులు బయటకి వస్తారు అని కామెంట్స్ చేసింది. దీనితో చాలా మంది నెటిజన్లు ఈసారి తాను టార్గెట్ పెట్టబోతుంది ట్రోలర్స్ అని అంటున్నారు. మార్ఫింగ్ పై చేసినట్లే ట్రోలర్స్ మీద కూడా కంప్లైంట్స్ చేసి, వాటిని ఫాలో అప్ చేసి వారికి శిక్షపడేలా చేయాలని భావిస్తోంది అని అంటున్నారు. మరికొంత మంది తన వెనకాల గోతి కాడ నక్కలా ఉండి వెన్ను పోటు పొడిచే వారి గురించి అని అంటున్నారు. మొత్తానికి అనసూయ మాత్రం బయటకి తెలియకుండా గేమ్ నడపాలని నిర్ణయించుకుందని మాత్రం అర్దం అవుతోంది.