కరోనా వైరస్ కారణంగా మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. చైనాలో ఈ ప్రాణాంతక వైరస్ కారణంగా దాదాపు రెండు వేలుకు పైగా మృతి చెందారు. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచాన్నే ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. చైనాలోని ఉహాన్‌లో గల ఓ సముద్రపు ఆహార మార్కెట్ కేంద్రంగా కొత్త వైరస్ వ్యాపించినట్లు అక్కడి అధికారులు గుర్తించారు. వైరస్ కారణంగా ఉహాన్‌లో ఇద్దరు మృతిచెందడంతో వెంటనే వీరి శాంపిల్స్‌ను లండన్‌ను పంపించి పరిశోధనలు చేపట్టారు. అక్కడి శాస్త్రవేత్తలు పరిశోధనలు జరిపి ఈ వైరస్‌ను ‘కరోనావైరస్’గా గుర్తించారు.
ఇక అప్పటి నుంచీ కరోనా ఎలా వ్యాపిందించో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ వైరస్ కారణంగా చైనాలో ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయి. తాజాగా ఈ వైరస్ తెలుగు రాష్టాల్లోనూ వ్యాపించిందంటూ వార్తలు వస్తున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇదిలా ఉంటే.. కరోనా వైరస్ భయం తెలుగు ప్రజలకు పట్టుకున్న నేపథ్యంలో పలువురు సెలబ్రిటీలు దీనిపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ రోజు యాంకర్ సుమ కూడా తన స్టైల్లో కరోనా వైరస్ గురించి చెబుతూ ఓ వీడియో పోస్ట్ చేసింది.
అందులో ‘జలుబు, దగ్గు, జ్వరం, ఛాతీలో నొప్పి, గుండె వేగంగా కొట్టుకోవడం, ఆయాసం జీర్ణకోశ సమస్యలు ఉంటే కచ్చితంగా కరోనా వైరస్ ఉన్నట్లు కాదు. కాకపోతే వైద్యుడిని సంప్రదించి చెక్ చేయించుకోండి. మన భారతీయ సంస్కృతి విధానంలో ఎవరైనా కనిపిస్తే నమస్కారం పెడతాం. ఎవరైనా ఇంటికి వస్తే కాళ్లు, చేతులు కడుక్కోవడానికి నీళ్లు ఇస్తాం’ అని తెలిపింది. ‘బాగా ఉడకబెట్టిన ఆహారపదార్థాలు తింటాం. ఇవన్నీ మళ్లీ అలవాటు చేసుకోవడం మొదలు పెడదాం. వైరస్ గురించి భయపడాల్సిన అవసరం లేదు. శుభ్రతే వైరస్‌కు చక్కటి మందు. ఓకే.. హాయిగా ఉండండి, ఆనందంగా ఉండండి.. హ్యాపీ డే..’ అని సుమ తెలిపింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
View this post on Instagram