నక్కలు, తోడేళ్లు కూటమిగా వస్తున్నాయి.. జాగ్రత్త : సీఎం జగన్

-

చంద్రబాబు సాధ్యం కానీ హామీలు ఇస్తున్నారని సీఎం జగన్ దుయ్యబట్టారు. కాకినాడలో సిద్ధం బహిరంగ సభలో మాట్లాడారు. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే.. రాష్ట్రంలో కొనసాగుతున్న పథకాలు రద్దు అవుతాయని తెలిపారు. దత్త పుత్రుడు టికెట్ ఇస్తే ఏర్పడిన కూటమి కాదు. బాబు ప్రయోజనం కోసం ఎక్కడ కావాలంటే అక్కడ నిలబడుతున్నారు. రాష్ట్రాన్ని హోల సేల్ గా దోచుకునేందుకు చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారు. జ్వరం వస్తే.. ఫ్యాకేజీ స్టార్ పిఠాపురం వదిలేసి హైదరాబాద్ పారిపోయే రకం అన్నారు. నక్కలు, తోడేళ్లు కూటమిగా వస్తున్నాయి జాగ్రత్త ఉండండి అని సూచించారు.

టీడీపీకి ఓటేస్తే.. చంద్రబాబు కత్తిరింపులు మొదలవుతాయి. మీ బిడ్డ వైఎస్ జగన్ 10 ఏళ్లు ఇదే స్థానంలో ఉంటే జగన్ మార్క్ విప్లవాలు కొనసాగుతాయి. లేదంటే.. గవర్నమెంట్ బడుల్లో ఇంగ్లిష్ మీడియం రద్దు, నాడు-నేడు రద్దు, బడి పిల్లలకు ఇచ్చే గోరుముద్ద కార్యక్రమం రద్దు, బడి తెరిచే సమయానికి ఇచ్చే విద్యాకానుక రద్దు. ట్యాబ్స్, విద్యా కానుక, వసతి దీవెన ఇలా అన్నీ కూడా రద్దు అవుతాయన్నరు. ప్రధానంగా చంద్రబాబు మార్క్ తో కత్తిరింపులు, ముగింపులు చూడాల్సి ఉంటుంది. మళ్లీ చంద్రముఖి నిద్ర లేస్తుంది.. లకలక, లకలక అంటూ అన్నింటికి ముగింపు పలుకుతుందని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news