చంద్రబాబు సాధ్యం కానీ హామీలు ఇస్తున్నారని సీఎం జగన్ దుయ్యబట్టారు. టీడీపీకి ఓటు వేస్తే.. పసుపుపతి నిద్రలేచి వదల బొమ్మాళి వదల అంటాడు. చంద్రబాబుకు కత్తిరింపులు మొదలవుతాయి. గోరు ముద్ద రద్దు.. విద్యాదీవెన, వసతి దీవెన, అమ్మఒడి రద్దు అవుతుంది. పేదవాడికి వైద్యం అందకుండా చేస్తుంది ఈ చంద్రముఖి. అక్కాచెల్లెమ్మలకు బతుకులు అతలాకుతులం అవుతాయి. ఫ్యాన్ కి ఓటు వేస్తేనే పథకాలన్నీ కొనసాగుతాయి. ప్రజలు ఆలోచించాలని కోరారు.
పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే.. రాష్ట్రంలో కొనసాగుతున్న పథకాలన్నీ రద్దు అవుతాయని తెలిపారు. దత్త పుత్రుడు టికెట్ ఇస్తే ఏర్పడిన కూటమి కాదు. బాబు ప్రయోజనం కోసం ఎక్కడ కావాలంటే అక్కడ నిలబడుతున్నారు. రాష్ట్రాన్ని హోల సేల్ గా దోచుకునేందుకు చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారు. జ్వరం వస్తే.. ఫ్యాకేజీ స్టార్ పిఠాపురం వదిలేసి హైదరాబాద్ పారిపోయే రకం అన్నారు. నక్కలు, తోడేళ్లు కూటమిగా వస్తున్నాయి జాగ్రత్త ఉండండి అని సూచించారు.