ఫ్యాకేజీ స్టార్ కి పెళ్లిళ్లే కాదు.. నియోజకవర్గాలు కూడా నాలుగు అయ్యాయి అని సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా కాకినాడలో జరిగిన మేమంతా సిద్ధం బహిరంగ సభలో మాట్లాడారు. గత ఎన్నికల్లో మాకు ఓటు వేయని వారికి అభివృద్ధి పథకాలకు అందించామని గుర్తు చేశారు. ఫ్యాకేజీ స్టార్ కి ఎక్కడ టికెట్ ఇవ్వాలో చంద్రబాబు నిర్ణయిస్తారు. పిఠాపురంలో జ్వరం వస్తే.. హైదరాబాద్ పారిపోతారు ఫ్యాకేజీ స్టార్.
ఎవ్వరూ ఉంటే మంచి జరుగుతుందో ఆలోచించి ఓటు వేయండి అని కోరారు. చంద్రబాబు సాధ్యం కానీ హామీలను ఇస్తున్నారు. మంచి చేసిన మీ బిడ్డ కావాలా..? పెత్తందారులతో కలిసి దోచుకునే కూటమి కావాలా..? ఆలోచించుకోండి. చంద్రబాబు ఏం చేయమంటే దత్త పుత్రుడు అది చేస్తారు. అలాగే చంద్రబాబు చెప్పిన వారికే వదిన పురంధేశ్వరీ టికెట్ ఇస్తారని పేర్కొన్నారు.