పేదల బాగు కోసమే నా తపన అని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తాజాగా ప్రజాగళం బహిరంగ సభలో మాట్లాడారు చంద్రబాబు. విశాఖలో వైసీపీ నేతలు భూ కబ్జాలు చేశారు. మేం విశాఖను వాణిజ్య రాజధాని చేశాం. కానీ, వైసీపీ ప్రభుత్వం విశాఖను గంజాయి, డ్రగ్స్ కి రాజధాని చేసింది. ఇక్కడికి అదానీ డేటా సెంటర్, లులు, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ తెచ్చాను. ఎంతో కష్టపడి మెల్టిక్ పార్కు తెచ్చా. వైసీపీ ప్రభుత్వం వచ్చాక వాటన్నింటినీ తరిమేసింది.
ఎవరి వల్ల అభివృద్ధి జరుగుతుందో ప్రజలు బేరీజు వేసుకోవాలి. జగన్ కి విశాఖ నగరంపై ప్రేమ లేదు.. ఆస్తుల మీదే ప్రేమ. విశాఖలో విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి పెత్తనం ఏంటి?” అని చంద్రబాబు ప్రశ్నించారు. పేద ప్రజల బాగు కోసమే నా ఆవేదన. నా బాధ. జగన్ వచ్చాక ఎస్సీలు, ఎస్టీలకు అన్యాయం జరిగింది. నాపై తప్పుడు కేసులు పెట్టారు.. వేధించారు. రాళ్ల దాడి కూడా చేస్తున్నారు. నేను అరెస్టయ్యాననే బెంగతో 203 మంది ప్రాణాలు వదిలారు. ఆ కార్యకర్తల కుటుంబాలకు భువనేశ్వరి ధైర్యం చెప్పారు. ప్రజల కోసం పని చేస్తున్న వ్యక్తి పవన్ కల్యాణ్. మోడీ మూడోసారి ప్రధాని అవుతారు. అందరం కలిసి రాష్ట్రానికి మళ్లీ పూర్వ వైభవం తీసుకొస్తామన్నారు.