మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా భావించిన ప్రభుత్వం మాది అని ఏపీ సీఎం జగన్ పేర్కొన్నారు. తాజాగా పెదకూరపాడులో నిర్వహించిన ప్రచార సభలో ఆయన మాట్లాడారు. మాయ మాటలతో 2014లో ప్రజలను మోసం చేసిన కూటమి.. ఇప్పుడ మళ్లీ అదే హామీలతో మీ ముందుకు వస్తుందని విమర్శించారు సీఎం జగన్. చంద్రబాబు మేనిఫెస్టోలో పెట్టిన హామీలలో ఏ ఒక్కటైనా నెరవేర్చారా..? అని ప్రశ్నించారు. మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా భావించిన ప్రభుత్వం మాది.. గ్రామ, వార్డు సచివాలయాలు, ఆర్బీకేల నిర్మాణం, అమ్మఒడి, రైత భరోసా, వాహనమిత్ర, చేదోడు వంటి ఎన్నో పథకాలను అమలు చేశామని చెప్పారు.
మీ బిడ్డ జగన్ మళ్లీ అధికారంలోకి వస్తేనే సంక్షేమ పథకాల అందుతాయని.. పొరపాటున చంద్రబాబు అధికారంలోకి వస్తే.. చంద్రముఖిలా లకలక అంటుందన్నారు. దాదాపు 3 పర్యాయాలు.. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు పేదలకు ఏం చేశారు అని ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో కరెంట్ కోతలు ఉన్న విషయం ప్రతీ ఒక్కరికీ తెలుసు అన్నారు. మా ప్రభుత్వంలో 9 గంటలు పగటి పూటనే నాణ్యమైన విద్యుత్ ను అందిస్తున్నామని తెలిపారు.