వైసీపీ పాలనలో ఖజానా ఖాలీ : ప్రధాని మోడీ

-

మద్యపాన నిషేదం అని చెప్పి అధికారంలోకి వచ్చిన వైసీపీ.. ఇప్పుడు మద్యం వ్యాపారం చేస్తోందని మోడీ వ్యాఖ్యానించారు. మద్యం సిండికేట్ ను నడుపుతోంది. వైసీపీ ప్రభుత్వంలో అవినీతి జెట్ స్పీడ్ లో ఉంటే.. అభివృద్ధికి మాత్రం బ్రేకులు వేశారు. వైసీపీ ప్రభుత్వానికి ఆర్థిక నిర్వహణ తెలియదు. అవినీతి నిర్వహణ మాత్రమే తెలుసు. రాష్ట్ర ఖజానాను వైసీపీ ఖాళీ చేసిందని ఆరోపించారు.

వైసీపీ ప్రభుత్వం అవినీతిని జెట్ స్పీడ్ తో పరుగెత్తించింది. అభివృద్ధి సున్నా.. అవినీతి వందశాతం. ఈ ఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీని పూర్తిగా తిరస్కరిస్తారు. రాష్ట్రమైనా, దేశమైనా అభివృద్ధి చెందాలంటే.. ఎన్డీఏ ప్రభుత్వం ఉండాలి. వైసీపీ సర్కారు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టింది. ఈ రాష్ట్రం ప్రతిభ వంతులైన యువతకు నెలవు. టెక్నాలజీ ఏపీ యువత శక్తిని ప్రపంచం గుర్తించింది. దేశం  చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్న సమయంలో రాష్ట్రం కూడా అంతే వేగంగా అభివృద్ధి చెందాలన్నారు ప్రధాని మోడీ.

Read more RELATED
Recommended to you

Latest news