ఇవాళ మరో రూ.2 వేల కోట్లు అప్పు చేసిన ఏపీ

-

ఏపీ ప్రభుత్వం ఇవాళ మరో రూ.2 వేల కోట్ల అప్పు చేసింది. రిజర్వు బ్యాంకులో సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా ఈ రుణాన్ని పొందింది. రిజర్వు బ్యాంకులో సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ మరో రెండు వేల కోట్ల రూపాయల అప్పు చేసింది.

రాష్ట్ర అభివృద్ధి రుణాల పేరిట ఈ వారం కూడా ప్రభుత్వం రుణాన్ని తీసుకుంది. రిజర్వు బ్యాంకు సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా రూ.వెయ్యి కోట్ల చొప్పున రెండు లాట్లలో ఈ రుణాన్ని పొందింది. 7.72 శాతం వడ్డీతో 12 ఏళ్ల కాలపరిమితితో రూ.వెయ్యి కోట్ల విలువైన సెక్యూరిటీ బాండ్లు.. అలాగే 20 ఏళ్ల కాలపరిమితితో 7.82 శాతం వడ్డీతో మరో రూ.వెయ్యి కోట్ల మేర సెక్యూరిటీ బాండ్ల వేలం వేశారు.

2022 ఏప్రిల్ 1 తేదీ నుంచి ఇప్పటి వరకూ రూ.28 వేల కోట్ల మేర సెక్యూరిటీ బాండ్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం (AP Govt) రుణాన్ని తీసుకుంది. ఎఫ్ఆర్​బీఎం చట్టం ప్రకారం మరో రూ.20 వేల కోట్ల వరకూ మాత్రమే బాండ్ల వేలానికి అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news