ఏపీలోటీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ – టెట్ ( ఉపాధ్యాయ అర్హత పరీక్ష) కు సమయం ఆసన్నమైంది. నేటి నుంచి ఏపీ టెట్ పరీక్ష ప్రారంభం కానుంది. ఆగస్టు 6 నుంచి 21 వరకు ఆన్ లైన్ విధానంలో టెట్ నిర్వహించనున్నారు అధికారులు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2:30 నుంచి 5 గంటల వరకు రెండో సెషన్ ఉంటుందని ప్రకటనలో వెల్లడించారు అధికారులు . హాల్ టికెట్లను వెబ్ సైట్ లో పొందుపరచామని, అభ్యర్థులు డౌన్ లోడ్ చేసుకుని, పరీక్షకు హాజరవ్వాలని తెలిపారు అధికారులు. ఆంధ్రప్రదేశ్ తో పాటు, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఒడిశాలలోనూ పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
ఓసీలకు 60, బీసీలకు 50, ఎస్‌సీ, ఎస్‌టీ, వికలాంగులకు 40 శాతం మార్కులు వస్తే అర్హత సాధించినట్లు పరిగణిస్తారు. అయితే.. టెట్‌లో సాధించిన మార్కులకు డీఎస్‌సీలో 20 శాతం వెయిటేజ్ ఉంటుంది.అయితే.. ఈ సారి టెట్లో అర్హత సాధిస్తే అభ్యర్థులకు జీవితాంతం చెల్లుబాటు అయ్యేలా మార్పులు చేసింది. ఆగస్టు 31న పరీక్ష ప్రాథమిక ‘కీ’, సెప్టెంబరు 1 నుంచి 7వ తేదీ వరకు ప్రాథమిక ‘కీ’పై అభ్యంతరాలు తెలపే అవకాశం కల్పించారు. సెప్టెంబరు 12న పైనల్ ‘కీ’, 14న ఫలితాలు వెల్లడి కానున్నాయి.