అమ్మ ఒడి డబ్బులు రావాలంటే..75 శాతం హాజరు ఉండాల్సిందే – సీఎం జగన్

-

జగనన్న అమ్మ ఒడి డబ్బులు బటన్ నొక్కి ఖాతాలలో వేసిన అనతరం సీఎం జగన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమ్మ ఒడి డబ్బులు రావాలంటే..75 శాతం హాజరు ఉండాల్సిందేనని విద్యార్థులకు షాక్‌ ఇచ్చారు సీఎం జగన్. అమ్మ ఒడి ఒక్క స్కీం ద్వారా మూడేళ్లలో అక్క చెల్లల ఖాతాలలో జమ చేసింది మొత్తం 19618 కోట్లు అని.. ప్రతి తల్లి బిడ్డలను మంచిగా చదివించాలనుకుంటుందని పేర్కొన్నారు.

ఓ వైపు చదివించాలని ఉన్న ఆర్దిక ఇబ్బందులు బాధపెడుతుంటాయని.. బడికి పంపిస్తే ప్రతి ఏటా 15000 అందిస్తున్నామని చెప్పారు. హాజరు నిభందన అమలు చేయటంతో 51 వేల వంది పిల్లలకు అమ్మ ఒడి ఇవ్వలేక పోయామని వెల్లడించారు.

ప్రపంచంలో ఎక్కడికైనా వెల్లి బ్రతికే సత్తా , చదువుతోనే వస్తుందని.. దేశంలో అన్ని రాష్ర్టాల కంటే మిన్నగా మన పిల్లల చదువులు ఒక హక్కుగా అందాలని ముందుకు వెలుతున్నామని పేర్కొన్నారు ముఖ్యమంత్రి జగన్ మోహాన్ రెడ్డి. అమ్మ ఒడి , నాడు నేడు , విద్యాకానుక , గోరుముద్ద , బై జ్యుస్ ఒప్పంద అన్నీ పిల్లల బవిష్యత్ కొసం తిసుకు వచ్చిన పధకాలే అని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news