గోరంట్లపై ABN రాధాకృష్ణ రూ. 10 కోట్ల పరువు నష్టం దావా !

వైసిపి పార్లమెంట్ సభ్యులు గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో గత వారం రోజులుగా తెలుగు రాష్ట్రాలను షేక్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ వీడియో ఫేక్ అని నిన్న అనంతపురం పోలీసులు తేల్చి చెప్పారు. దీంతో ఎంపీ గోరంట్ల మాధవ్ కు కాస్త ఊరట లభించింది.

పోలీసులు ప్రకటించిన అనంతరమే.. ఎంపీ గోరంట్ల మాధవ్ మీడియా ముందుకు వచ్చి… ఏబీఎన్ రాధాకృష్ణ మరియు చంద్రబాబు నాయుడు పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యంగా ఏబీఎన్ రాధాకృష్ణను పచ్చి బూతులు ఎంపీ మాధవ్.

అయితే తాజాగా ఎంపీ మాధవ్ వ్యాఖ్యలను సీరియస్ గా పరిగణించిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ అధినేత రాధాకృష్ణ… న్యాయపరమైన చర్యలకు సిద్ధమయ్యారు. ఈ వీడియో ప్రసారమైన సందర్భంలో ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన సందర్భంగా తనను ఎంపీ మాధవ్ దుర్భాషలాడారని రాధాకృష్ణ ఆరోపించారు. అందుకుగాను ఎంపీ మాధవ్ పై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని 10 కోట్లకు పరువు నష్టo దావ వేశారు. అలాగే ఎంపీపై క్రిమినల్, డిఫామేషన్ చర్యలకు కూడా రాధాకృష్ణ సిద్ధమయ్యారు.