అచ్చెన్నాకు అత్యుత్తమైన ఆరోవేలు చూపిస్తోన్న బాబు!!

-

అరచేతికి ఐదువేళ్లు ఉండగా.. ఆరోవేలు చాలా అత్యున్నతమైనది.. అది చాలా విలువైనది.. అంతకుమించిన పదవి మరొకటి లేదు అన్నరేంజ్ లో చంద్రబాబు కవరింగ్ ఇస్తున్నారని అంటున్నారు విశ్లేషకులు. నిజంగా ఆరోవేలు అంత గొప్పదా.. అంత విలువైనదా.. అంత అత్యుత్తమమైనదా.? అసలు ఈ ఆరో వేలు ఏమిటి? మొదలైన వివరాలు ఇప్పుడు చుద్దాం!

 

బాబు ఇప్పటికీ మారలేదు.. పుట్టుకతో వచ్చిన బుద్దులు పుడకలతో కానీ పోవనే సామెతను గుర్తుచేస్తున్నట్లుగా.. బాబు కోసం అత్యంత నిజాయితీగా పనిచేసే వ్యక్తి అనే పేరు సంపాదించుకున్న అచ్చెన్నాయుడుని బాబు మరోసారి దగా చేయబోతున్నారని అంటున్నారు విశ్లేషకులు. అచ్చెన్నకు పార్టీ అధ్యక్ష పదవి ఇస్తున్న చంద్రబాబు… అది చాలా అత్యున్నత పదవి కట్టబెడుతున్నామని చెబుతున్నారట!

ఈ విషయాలన్నీ జైల్లో ఉన్న 70రోజుల్లోనే అన్నీ అర్ధం చేసుకున్న అచ్చెన్న… ప్రస్తుతం పార్టీకి చంద్రబాబుకి కూడా దూరంగా ఉంటున్నట్లే ప్రచారం జరుగుతోంది. జైలుకు వెళ్లడంతో బాబు వైఖరి మొత్తం ఆయనకు అర్థమైనట్లుగా చెబుతున్నారు! ఈ క్రమంలో పార్టీ అధ్యక్ష పదవి గురించి బాబు ఎంత గొప్పగా వర్ణిస్తున్నా… దాన్ని అచ్చెన్న మాత్రం ఆరోవేలుగానే చూస్తున్నారని అంటున్నారు!!

ఈ లెక్కన చూసుకుంటే… ఆ ఆరోవేలు కోసం అంత ఆత్రం తనకు లేదని అచ్చెన్నా లైట్ తీసుకుంటారా? లేక ఏదైతేనేమి చచ్చినోడిపెళ్లికి వచ్చిందే కట్నం అన్న భావనలో ఆరోవేలే మహా భాగ్యం అన్న చందంగా రెడీ అయిపోతారా అన్నది వేచి చూడాలి!! అచ్చెన్నకు తత్వం బోదపడిందా లేక ఇంకా బాబు మాయలోనే ఉన్నారా అన్నది తెలియాలంటే మరో నాలుగైదు రోజులు ఆగాల్సిందే!!

 

-CH Raja

Read more RELATED
Recommended to you

Latest news