ఏపీ పదో తరగతి విద్యార్థులకు షాక్.. బెటర్ మెంట్ లో 2 సబ్జెక్టులకు మాత్రమే అవకాశం !

-

ఏపీ పదవ తరగతి పరీక్షలకు బిగ్ షాక్ ఇచ్చింది వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. పదో తరగతిలో తక్కువ మార్కులు వచ్చిన వారు మార్కులు పెంచుకునేందుకు బెటర్మెంట్ ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కేవలం రెండు సబ్జెక్టులకు మాత్రమే అవకాశం ఇచ్చింది. 49 అంతకంటే తక్కువ మార్కులు వచ్చిన.. ఏవైనా రెండు సబ్జెక్టులలో మాత్రమే బెటర్మెంట్ పరీక్షలు రాయవచ్చు.

ఇందుకుగాను సబ్జెక్ట్‌కు 500 రూపాయల చొప్పున రెండు సబ్జెక్ట్‌లకు 1000 రూపాయిల ఫీజుగా విద్యాశాఖ నిర్ణయించింది. ఇదిలా ఉంటే.. ఇక రాష్ట్రంలో టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షల్లో ఫెయిలైన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

వారిని అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు సంసిద్ధం చేసేందుకు పాఠశాల విద్యాశాఖ ప్రణాళికను సిద్ధం చేసింది. ఈమేరకు రాష్ట్రంలోని ప్రాంతీయ సంయుక్త సంచాలకులు (ఆర్జేడీలు), జిల్లా విద్యాధికారులకు (డీఈవోలకు) పాఠశాలవిద్య కమిషనర్‌ ఎస్‌.సురేష్‌కుమార్‌ మార్గదర్శకాలు జారీచేశారు. రోజూ రెండు సబ్జెక్టులపై విద్యార్థులకు బోధన సాగేలా కార్యాచరణ చేపట్టాలని ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Latest news