ఏపీ ప్రజలకు అలర్ట్..ఏపీలో 3 రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. వాయువ్య బంగాళాఖాతంలో పశ్చిమ బెంగాల్, ఒరిస్సా తీరాలకు ఆనుకొని ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోంది. దానికి అనుబంధంగా సముద్రమట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తన విస్తరించి ఉంది.
ఇవాళ అల్లూరి సీతారామరాజు జిల్లా, అనకాపల్లి జిల్లా, పార్వతీ మన్యం జిల్లా, శ్రీ కాకుళం జిల్లా, విశాఖపట్నం జిల్లా, విజయనగరం జిల్లాల్లో భారీ వర్షాలు కురువనున్నాయి. కృష్ణా, పల్నాడు, ప్రకాశం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. విజయనగరం, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్య సాయి, కడప, అన్నమయ్య జిల్లా ల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉంది.