మాచర్లలో మంట పెట్టింది చంద్రబాబే – అంబటి రాంబాబు

-

మాచర్లలో మంట పెట్టింది చంద్రబాబేనని మంత్రి అంబటి రాంబాబు ఫైర్‌ అయ్యారు. ఉద్రిక్తతలు సృష్టించిన వారిపై కఠిన చర్యలకు కోరుతున్నామని.. మాచర్లలో రాళ్లతో, బరిసెలతో, మోటారు బైకులమీద పక్కా పథకం ప్రకారం సామాన్య ప్రజలమీద దాడిచేసింది ఎవరు?అని నిలదీశారు. నేరుగా మాచర్ల టీడీపీ ఇన్‌ఛార్జే ఈ విధ్వంసంలో సూత్రధారి, పాత్రధారి అని, ఇది చంద్రబాబుకు తెలిసే జరిగిందని ఆగ్రహించారు.

ఎందుకంటే.. ఇటీవలే మాచర్ల సహా పల్నాడు ప్రాంతంలో పర్యటించిన చంద్రబాబు అక్కడివారిని ఎంతగా రెచ్చగొట్టాడో, దాడులు చేయాల్సిందిగా బహిరంగ సభల్లోనే ఎలాంటి సందేశం ఇచ్చాడో అందరికీ తెలుసన్నారు. మాచర్లలో ఇదేం ఖర్మ అంటూ బాబు మనుషులు వస్తుంటే.. స్థానిక ప్రజలు జగనన్న పరిపాలనలో తమకు మేలే జరిగిందని, స్కీంలు- అవినీతిలేకుండా, పక్షపాతం లేకుండా అందాయని చెప్పడంతో తట్టుకోలేని టీడీపీ నాయకులు ఒక పథకం ప్రకారమే మాచర్లలో దాడికి దిగారని ఆగ్రహించారు అంబటి.

ప్రజలను కలవడానికి వెళ్తున్న ఏ నాయకుడైనా కత్తులు, రాడ్లు, బరిసెలు తీసుకుని వెళ్తారా? మేం ఇది చేశామని చెప్పుకోవడానికో, అవతలి పార్టీ చేయలేదని చెప్పుకోవడానికో వెళ్లే పరిస్థితి, అది పోయి రాళ్లు, కత్తులు, బడితెలు తీసుకెళ్లారంటే అర్థం ఏమిటి అని నిలదీశారు. మాచర్ల ఘటనకు బాధ్యులైన టీడీపీ నాయకులపై కఠినంగా వ్యవహరించాలని పోలీసు శాఖను కోరుతున్నామని డిమాండ్‌ చేశారు అంబటి రాంబాబు.

Read more RELATED
Recommended to you

Latest news