అమ్మఒడి పథకం లబ్ది దారులకు బిగ్‌ షాక్‌..లక్ష మందికి కోత !

ఈ నెల 27 తేదీన అమ్మఒడి పథకం నిధులను ఏపీ ప్రభుత్వం విడుదల చేయనుంది. శ్రీకాకుళం జిల్లాలో 2022-23 ఆర్ధిక సంవత్సరానికి అమ్మఒడి పథకాన్ని ప్రారంభించనున్నారు సీఎం జగన్. ఈ నెల 23 తేదీన చేపట్టాల్సిన ఈ కార్యక్రమాన్ని వివిధ కారణాల వల్ల వాయిదా వేసిన ప్రభుత్వం… లబ్ధిదారుల ఖాతాలో ఈ ఏడాది రూ. 13 వేలను జమ చేయనుంది.

2022-23 ఆర్ధిక సంవత్సరానికి రూ 6500 కోట్ల మేర బడ్జెట్ కేటాయింపులు చేసింది సర్కార్‌. 2021-22లోనూ రూ. 6107 కోట్ల బడ్జెట్లో పెట్టినా అమ్మఒడిని అమలు చేయని ప్రభుత్వం… ఈ సారి లబ్దిదారుల సంఖ్యలో వివిధ కారణాలతో లక్ష మందికి అమ్మఒడి పథకం కోత పెట్టేందుకు సిద్దమైంది.

పాఠశాలలకు గైర్హాజరు కావటంతో 51 వేల మందికి అమ్మఒడి పథకానికి అనర్హులుగా తేల్చిన ప్రభుత్వం… మిగతా 50 వేల మంది పై చిలుకు విద్యార్ధులకూ వేర్వేరు కారణాలతో పథకం నిలిపివేసింది. 2019-20 ఆర్ధిక సంవత్సరానికి రూ. 6301 కో ట్ల రూపాయలు అమ్మఒడి పథకాన్ని అందించింది ఏపీ ప్రభుత్వం.