అన్నీ అయిపోయాయి… శ్రావణ శుక్రవారం మిగిలింది!

-

ఏపీ ముఖ్యమంత్రి, మూడు ప్రాంతాల ప్రజలు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించిన మూడు రాజధానుల బిల్లు, సీఆర్డీయే రద్దు బిల్లులను గవర్నర్ అమోదించారు! దీంతో రాజధాని రైతుల సంగతేమో కానీ.. అక్కడున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు, కొంతమంది గత ప్రభుత్వ పెద్దలు హాహాకారాలు చేస్తున్నారనే కామెంట్లు మొదలైపోయాయి. సోషల్ మీడియా వేదికగా ఇది కేంద్రంలోని బీజేపీ కుట్ర అని కొందరంటే… అన్యాయం, అక్రమం అని మరికొందరు చెబుతున్నారు. ఆ సంగతులు అలా ఉంటే… తాజాగా ఈ విషయంపై టీడీపీ నేతలు, వారి అనుకూల మీడియా ఒక కొత్త స్వరం వినిపించడం మొదలుపెట్టింది.

అన్నీ అయిపోయాయిరా అల్లుడా అంటే… అన్నం గిన్నైనా ఎత్తుకో అన్నాడంట వెనకటికి ఒకడు… అన్నట్లుగా సాగుతోంది టీడీపీ నేతల వాదన! అమరావతి ని పూర్తి రాజధానిగా కాకుండా… వన్ ఆఫ్ ద క్యాపిటల్ గా నిర్ణయించిన బిల్లులు గవర్నర్ ఆమోదం తెలపడంతో.. ఇందులో అటు ఏపీ ప్రభుత్వాన్ని, ఇటు గవర్నర్ ను ఏమీ అనలేని టీడీపీ నేతలు, వారి అనుకూల మీడియా… శ్రావణ శుక్రవారం నాడు అమరవాతి విషయంలో బ్యాడ్ న్యూస్ చెప్పారని చెబుతున్నారు.

ఇక్కడ పాయింట్ 29 గ్రామాలలోని కొందరి అభిప్రాయంకంటే… ఒక పార్టీ వ్యక్తిగత ఆర్ధిక అంశాలని ప్రభావితం చేసే అంశంకంటే… 13 జిల్లాల ప్రజల అభిప్రాయానికి, 175లో 151 సీట్లు సంపాదించిన ముఖ్యమంత్రి అభిప్రాయానికి, రాజ్యాంగానికి, చట్టానికి లోబడి గవర్నర్ ఆమోదం పొందినట్లయ్యిందని అంటున్నారు విశ్లేషకులు! ఇక్కడ గవర్నర్ అభిప్రాయాన్ని సమర్ధించలేక, విభేదించలేక ఇరకాటంలో పడిన తమ్ముళ్లు… శ్రావణ శుక్రవారం నాడు హిందూ పున్నాదులపై ఏర్పడిన బీజేపీ, ఏపీకి నష్టం చేసిందని చెప్పడం కొసమెరుపు!! అయితే… రేపు చెబితే ఓకే నా.. ఎల్లుండు చెబితే ఓకేనా అనేది నెటిజన్ల్ ప్రశ్న!

Read more RELATED
Recommended to you

Latest news