గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిలో ఏపీ సరికొత్త చరిత్ర

-

గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిలో ఏపీ సరికొత్త చరిత్ర సృష్టించింది. గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ అవతరించనుంది. తరిగిపోతున్న శిలాజ ఇంధన వనరులకు ప్రత్యామ్నాయంగా స్వచ్ఛ ఇంధనాన్ని వినియోగంలోకి తెచ్చే ప్రయత్నాల్లో ఏపీ భాగం కానుంది. ఈ ప్రాజెక్టు కోసం కేంద్రం ఎంపిక చేసిన ఐదు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఉంది.

విశాఖ నెల్లూరు జిల్లాలో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి జరగనుంది. కేంద్ర పునరుత్పాదక ఇంధన వనరుల మంత్రిత్వ శాఖకు, నీతి అయోగ్ కు ఇండియా హైడ్రోజన్ అలయన్స్ తాజాగా సమర్పించిన హైడ్రోజన్ హబ్ డెవలప్మెంట్ ప్లాన్ లో ఈ విషయాన్ని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఈ హబ్ లను రూపొందిస్తారు.

గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ, ఆంధ్రప్రదేశ్ లో ఐదు జాతీయ గ్రీన్ హైడ్రోజన్ హబ్ లు ఏర్పాటు చేసి వీటిని 25 ప్రాజెక్టు క్లస్టర్లుగా విభజిస్తారు. వీటి ద్వారా 2025 నాటికి గ్రీన్ హైడ్రోజన్ ను ఉత్పత్తి చేసే 150 మెగా వాట్ల ఎలక్ట్రోలైజర్ ప్లాంట్ల ఏర్పాటు లక్ష్యంగా ఐహెచ్2ఏ నిర్దేశించింది. వీటిని మొదటి తరం జాతీయ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులుగా పిలుస్తారు. ఈ గ్రీన్ హైడ్రోజన్ ను వివిధ రంగాలకు చెందిన సంస్థలు ఉపయోగించుకునేలా ప్రణాళికలు రూపొందిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news