ఆంధ్ర ప్రీమియర్ లీగ్(APL) ఆటగాళ్ల వేలం పాట ప్రారంభం

విశాఖ పట్టణంలో ని రాడిసన్ బ్లూ హోటల్ లో ఆంధ్ర ప్రీమియర్ లీగ్(APL) ఆటగాళ్ల వేలం పాట శుక్రవారం ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎపీఎల్ వేలంలో 368 ఆటగాళ్లు పాల్గొంటారు. ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు ఆరు మేనేజ్మెంట్ లు పోటీపడుతున్నాయి. ఐకాన్ ప్లేయర్ గా కే.ఎస్ భరత్, రిక్కీ భూయి, కె.వి శశికాంత్, అశ్విని హెబ్బర్, రషీద్ తదితరులు ఉన్నారు.

ప్రముఖ క్రికెట్ కామెంటర్ చారుశర్మ నేతృత్వంలో ఐపీఎల్ వేలం పాట జరుగుతోంది. ఆంధ్ర ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగే ఈ క్రికెట్ లీగ్ పోటీలు జూలై 6 నుంచి 17వ తేదీ వరకు విశాఖలో జరుగుతాయి. ఈ ఏపిఎల్ మెగా ఈవెంట్లో భాగస్వామ్యం అవుతున్న ఆరు ఫ్రాంచైజీ జట్లు ఇవే.. ఉత్తరాంధ్ర లయన్స్, రాయలసీమ కింగ్స్, గోదావరి టైటాన్స్, కోస్టల్ రైడర్స్, బెజవాడ టైగర్స్, వైజాగ్ వారియర్స్.