అమరావతి : సీఎం జగన్ పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత. మద్యపాన నిషేధమని చెప్పి, బుగ్గలునొక్కి, తలలునిమిరి ఆడ బిడ్డల ఓట్లు కొల్లగొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా గ్రహం చవిచూడకముందే సీఎం జగన్ మద్యం వ్యాపారాన్ని, గంజాయి, నాటుసారా విక్రయాలను కట్టడిచేస్తే మంచిదని హెచ్చరించారు వంగలపూడి అనిత.
జంగారెడ్డి గూడెంలో 17 కుటుంబాలు రోడ్డున పడటానికి సీఎం ధనదాహామే కారణం అని నిప్పులు చెరిగారు. వాలంటీర్లు, వైసీపీ నేతలే నాటు సారా, గంజాయి విక్రయాలు సాగిస్తుంటే ఎందుకు నిరోధించడం లేదు ? అని ఆగ్రహం వ్యక్తం చేశారు వంగలపూడి అనిత.
మద్యం అమ్మకాలతో ఆదాయం పెంచుకోవడంపై చూపుతున్న శ్రధ్ధలో సగమైనా మహిళల మాన ప్రాణాలపై చూపితే బాగుంటుందని చెప్పారు. ఇప్పుడు వారి పుస్తెలు తెంపు తూ, తన ఖజానా నింపు కుంటున్నారని… రాష్ట్రంలో నాటుసారా అమ్మకాలు విచ్చలవిడిగా జరుతున్నాయని స్వయంగా స్పీకరే చెప్పారని ఆగ్రహించారు.