ఏపీ అసెంబ్లీ సమావేశాలు : నేడు సభ ముందుకు కీలక బిల్లులు

-

అమరావతి : మూడు రోజుల గ్యాప్ అనంతరం ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభం కానున్నాయి ఏపీ అసెంబ్లీ సమావేశాలు. మొదటగా ప్రశ్నోత్తరాలు, దేవదాయ, ఎక్సైజ్ శాఖలకు చెందిన బిల్లులను ఆమోదించనుంది అసెంబ్లీ. అసెంబ్లీలో వివిధ పద్దులపై చర్చ, ఆమోదం కానుంది. పోలవరం ప్రాజెక్టు ప్రగతిపై స్వల్ప కాలిక చర్చ జరుగనుంది.

అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో చర్చకు వచ్చే అంశాలు..:
సీఎంఆర్ఎఫ్, మత్స్యకారులకు ఆర్ధిక సాయం, వైజాగ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఇన్పుట్ సబ్సిడీ.
ఎంపీఈఓలకు కనీస వేతనం, వైఎస్సార్ సంపూర్ణ పోషణ, ఆశా వర్కర్ల జీతాలు, ఎంఎస్ఎంఈ ప్రొత్సాహాకాలు, కోవిడ్ నష్ట పరిహరం, ఆర్టీసీ బలోపేతం.
ప్రశ్నోత్తరాల అనంతరం అంతరాష్ట్ర జల వివాదాలపై కాలింగ్ అటెన్షన్ కింద మండలిలో చర్చ.
ఇళ్ల స్థలాలు, ఇళ్ల నిర్మాణంపై స్వల్ప కాలిక చర్చ

మండలి ప్రశ్నోత్తరాల్లో చర్చకు వచ్చే అంశాలు..:
జగనన్న చేదోడు, ఎస్సీ, ఎస్టీల్లో కొన్ని కులాల చేరిక, సమ్మిళిత అభివృద్ధి, రజక కులాల చెరువుల ఆక్రమణ, జగనన్న గోరు ముద్ద.
కృష్ణపట్నం ధర్మల్ పవర్ స్టేషన్, ఏపీఎస్ఎఫ్ఎల్ లో అవినీతి, కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలు, పోలీస్ ఉద్యోగుల సంక్షేమం.

Read more RELATED
Recommended to you

Latest news