ఏపీలో బీజేపీ లక్ష్యం, వ్యూహం తెలిసిపోయాయి!

ఏపీలో హిందుత్వ నినాదం పూర్తిగా పనిచేయదని తెలిసినా కూడా బీజేపీ పూర్తిగా ఆ కోణంలోనే ముందుకుపోతున్న సంగతి తెలిసిందే! ఏపీలాంటి ఒక రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే కేవలం ఒక మతాన్నో, కులాన్నో.. ఆ మంతంలోని కొన్ని సమస్యలనో మాత్రమే టార్గెట్ చేసుకుని ముందుకు వెళ్లడం జరిగేపని కాదు! అయినా కూడా బీజేపీ ఆ పంథానే ఎంచుకోవడనికి గల కారణాలు వేరే అని అంటున్నారు విశ్లేషకులు!

అవును… ఏపీలో బీజేపీ కేవలం హిందుత్వ నినాధం మీద అధికారంలోకి రావడం కల! ఈ సమయంలో 2024లో వారి టార్గెట్ అత్యంత బలమైన జగన్ ని ఎదుర్కొని అధికారంలోకి రావడం కాదు. టీడీపీ స్థానాన్ని వారు భర్తీ చేయాలనుకోవడం! ప్రస్తుతానికైతే బీజేపీ లక్ష్యం ఇదే అని అంటున్నారు రాజకీయ పండితులు! ఇందుకోసమే వారు హిందుత్వ నినాదాన్ని ఏపీలో ఎత్తుకున్నారనేది వారి వాదన!

ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీని దెబ్బకొట్టి దాని స్థానంలోకి రావాలనుకుంటున్న బీజేపీ ఎంచుకున్న మార్గం.. కుల, మత ప్రాతిపదికన ప్రజలను పోలరైజ్‌ చేయడం! జగన్‌ వెనుక క్రైస్తవులు, ముస్లింలు పుష్కలంగా ఉన్నారు. ఇదే సమయంలో హిందువులు కూడా బలంగా ఉన్నారు! ఈ సమయంలో ఆ సమస్య చెప్పి ఈ సమస్య చెప్పి ఎంతో కొంతమంది హిందువులను తమ వైపునకు తిప్పుకోగలిగితే టీడీపీ కథ కంచికి అని నమ్ముతుంది బీజేపీ!

దానికి బలమైన ఆలోచనకూడా వారికి లేకపోలేదు! బీజేపీ కాస్త మనసుపెట్టి ఈ ఉత్సాహం ఎన్నికల నాటివరకూ ఉంచుకోగలిగితే.. హిందువులలో ఒక వర్గాన్ని దగ్గరకు చేరదీసుకోవచ్చు! ఈ సమయంలో ఆ వర్గం లేద కొంత శాతం హిందువులు బీజేపీకి మద్దతుగా నిలిచినంత మాత్రాన రాజకీయంగా జగన్ ‌కి వచ్చే నష్టమేమీ లేదు. కానీ… టీడీపీకి మాత్రం గట్టి దెబ్బే!! ఈ రకంగా బీజేపీ ఏపీలో వ్యూహాలు రచిస్తోందని అంటున్నారు విశ్లేషకులు! ఈ లెక్కన చూసుకుంటే… చంద్రబాబు పరిస్థితి??

-CH Raja