అన్ని స్కూళ్లకు ఇంటర్నెట్‌.. పీడీఎఫ్‌ రూపంలో పాఠాలు : ఏపీ సీఎం జగన్‌

-

పాఠశాలల్లో ఎక్కడా పుస్తకాల కొరత రానీయొద్దని ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ అధికారులకు స్పష్టం చేశారు. వచ్చే ఏప్రిల్‌లో అందించే జగనన్న విద్యాకానుక కిట్ల పంపిణీకి ఇప్పటి నుంచే అన్ని రకాలుగా సిద్ధం కావాలని ఆదేశించారు. పిల్లలకు అందిస్తున్న యూనిఫాం నాణ్యతను పరిశీలించారు. పాఠ్యపుస్తకాల కంటెంట్‌ను పీడీఎఫ్‌ ఫైల్స్‌ రూపంలో అందరికీ అందుబాటులో ఉండేలా చూడాలని.. అప్పుడే అందరికీ పాఠ్యపుస్తకాలు అందుబాటులోకి వస్తాయన్నారు.

ప్రభుత్వ ముద్రణా సంస్థ నుంచి పాఠ్యపుస్తకాలు అందించాలని సూచించారు. 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణీకి టెండర్లు ఖరారు చేసి వెంటనే ఆర్డర్‌ ఇవ్వాలని సీఎం ఆదేశించారు. ప్రతి తరగతి గదిలోనూ ఉండాల్సిన సామగ్రిపై కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు. విద్యార్థినులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఒక మహిళా ఉపాధ్యాయురాలిని కౌన్సిలింగ్‌కోసం నియమించాలన్నారు.

స్కూళ్ల నిర్వహణ కోసం ప్రత్యేక అధికారిని నియమించాలని, అన్ని పాఠశాలలకు ఇంటర్నెట్‌ సదుపాయం కల్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్‌, ఉన్నతాధికారులతో విద్యా శాఖపై నిర్వహించిన సమీక్షలో ఈ మేరకు సీఎం జగన్‌ ఆదేశాలు జారీ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news