నిన్న విశాఖలోని శారదా పీఠాన్ని దర్శించుకునేందుకు సీఎం జగన్ వెళ్లారు. ఈ సమయంలో పోలీసులు ఆంక్షల పేరుతో అతి చేయడంతో సర్వత్రా ప్రజల నుంచి విమర్శలు ఎదురవుతున్నాయి. పోలీసులు అత్యుత్సాహం విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులకు, సాధారణ ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగించాయి.
తాజాగా నిన్న జరిగిన ఘటనపై ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న తన రాక సందర్భంగా విశాఖ విమానాశ్రయం దగ్గర పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించడంపై సీఎం జగన్ ఫైరయ్యారు. గంటల తరబడి ట్రాఫిక్ ని ఎందుకు ఆపారని.. ప్రయాణికులకు ఎందుకు ఇబ్బందులు కలుగజేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు అసౌకర్యం కలిగించినందుకు చింతిస్తున్నానని.. దీనిపై విచారణ జరపాలని డీజీపీని జగన్ ఆదేశించారు. నిన్న ఎయిర్ పోర్ట్ దగ్గర ప్రయాణికులను నిలిపివేయడంతో తమ లగేజీతో పరిగెత్తుకుంటూ.. విమానాశ్రయానికి చేరుకోవాల్సి వచ్చింది. ఈ ఘటనపై ప్రయాణికులు తీవ్రంగా స్పందించారు.
మరోవైపు మంత్రి సిదిరి అప్పల్రాజుకు చేదు అనుభవం ఎదురైంది. సీఎం జగన్ వచ్చిన సందర్భంగా శారదా పీఠంలోకి వెళ్లే క్రమంలో అక్కడే ఉన్న సీఐ మంత్రిని అడ్డుకోవడం కూడా విమర్శలకు తావిస్తోంది.