పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా.. అభివృద్ధికి నోచుకోలేదంటూ.. వైసీపీ ఎమ్మెల్యేలు తీవ్రస్థాయి లో విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. అనంతపురం నుంచి ఆముదాల వలస వరకు కూడా ఇ దే తరహా వ్యతిరేక వ్యాఖ్యలు గుప్పించారు వైసీపీ నేతలు. వీరిలో సీనియర్ నేతలు.. ఆనం రామనారాయణరెడ్డి.. వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు వంటి వీర విధేయులు కూడా ఉన్నారు. ఈ పరిణామా లు ఇప్పటికే ఒకవైపు న్యాయపోరాటాలతో అలసి పోతున్న ప్రభుత్వానికి మరింత ఇబ్బందికర పరిణామం ఏర్పడేలా చేసింది.
ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రభుత్వం చేసిన మంచి పనులను, పథకాలను ఓ మంచి ప్రణాళికలతో ముందుకు తీసుకువెళ్లాలని వైసీపీ అధినేత జగన్ ప్రకటించారు. దీనికి సంబంధించి ఆయన వారం పాటు సమీక్షలు కూడా నిర్వహించారు. ఇంత జరిగిన తర్వాత.. ప్రభుత్వం చేసిన మంచి పనులు ప్రజల్లోకి వెళ్తాయని ఆయన అనుకున్నారు. కానీ, అనూహ్యంగా ఇప్పుడు సొంత పార్టీ నేతలనుంచి.. పైగా తన సా మాజిక వర్గం వారి నుంచి ఇలా వ్యతిరేకత రావడంతో జగన్ ఉలిక్కిపడినట్టు అయింది. ఈ క్రమంలోనే ఆయన సంచలన నిర్ణయం తీసుకున్నారని సీఎంవో వర్గాలు చెబుతున్నాయి.
త్వరలోనే పార్టీలోని సీనియర్ ఎమ్మెల్యేలతో జగన్ భేటీ అవ్వాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. ఇప్పటికే అసంతృప్త ఎమ్మెల్యేలు సహా .. అందరికీ ఆహ్వానాలు వెళ్లాయని చెబుతున్నారు. అదేసమయం లో జిల్లా ఇంచార్జ్ మంత్రులకు కూడా జగన్ నుంచి పిలుపు అందినట్టు చెబుతున్నారు.ఏదైనా సమస్య ఉంటే.. పార్టీ అంతర్గత చర్చల్లో చెప్పాలని గతంలోనే జగన్ ఒకసారి హెచ్చరించారు.
అదే సమయంలో జిల్లాలో ఏ సమస్య లేకుండా చూడాల్సిన బాధ్యత ఇంచార్జ్ మంత్రులపై ఉంటుందని కూడా ఆయన గతంలోనే చెప్పారు. ఇప్పుడు జిల్లా ఇంచార్జ్ మంత్రులు తప్పుకొని నేరుగా ఎమ్మెల్యేలు రోడ్డెక్కడంపై జగన్ సీరియస్‌గా ఉన్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఏం జరుగుతుందనేది ఆసక్తిగామారింది. ఈ నెల పదిలోపు.. దీనిపై జగన్ చర్చించనున్నారు.