జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. పింఛన్ల పెంపు, ఈబీసీ నేస్తంపై కీలక నిర్ణయం

ఏపీ ప్రజలకు మరోసారి జగన్ సర్కార్ తీపి కబురు చెప్పింది. పెన్షన్ లబ్ధిదారులకు మరింత ప్రయోజనం చేకూరేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొత్త ఏడాది కానుకగా జనవరి 1 నుంచి పెన్షన్ మొత్తాన్ని రూ.2500కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా లక్షల్లో ఉన్న పెన్షన్ లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరనుంది. ఇప్పటి వరకు పెన్షన్ కింద రూ. 2250లను ఇస్తోంది ప్రభుత్వం.. తాజాగా ఈనిర్ణయంతో వచ్చే ఏడాది జనవరి నుంచి పెన్షన్ మెత్తం పెరుగనుంది.

ఇదిలా ఉంటే మరోవైపు ఈబీసీలకు కూడా ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. జనవరి 9 నుంచి ఈబీసీ నేస్తం పథకాన్ని ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈబీసీ నేస్తం పథకం కింద అగ్రవర్ణాల్లో 45 నుంచి 60 ఏళ్లలోపు వయసు ఉండే నిరుపేద మహిళలకు రూ.15వేలు జమ చేయనున్నారు. రానున్న మూడేళ్ల లో ఈ పథకం కింద రూ. 45 వేలు ఇవ్వనున్నారు. రైతు భరోసా పథకం డబ్బులను కూడా జనవవరిలో ప్రభుత్వం జమ చేయనుంది.