ఉచిత ఇసుక పాలసీలో సినరేజి ఫీజు మాఫీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు..!

-

ఉచిత ఇసుక పాలసీ 2024లో సినరేజి ఫీజు మాఫీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జీవో జారి చేసారు మైన్స్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మినా. ఉచిత ఇసుక పాలసిపై ఈ నెల 21న జరిగిన సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయలను అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసారు. ఎటువంటి రుసుము చెల్లించకుండ ఇసుకను నిర్మాణ అవసరాలకు తీసుకు వెళ్ళేలా ఆదేశాలు ఇచ్చారు. నిర్మాణ రంగం వలన ఉపాధి ఆదాయం పెరుగుతున్నందున్నారు. దీనిలో భాగంగా సినరేజీ ఫీజు, మెరిట్ అన్ శాండ్ , డిఎంఎఫ్ మాఫీకి చర్యలు చేపట్టినట్టు ఉత్తర్వుల్లో వెల్లడించారు.

అయితే దీనివల్ల స్థానికంగా ఇసుక లభ్యత రవాణా పెరుగుతుంది అని ఉత్తర్వులు పేర్కొన్న ప్రభుత్వం.. ఇసుక బ్లాక్ మార్కెటింగ్ ను నివారించేలా విజిలెన్స్ నూ పటిష్టం చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇసుక లభ్యతను పెంచేలా ప్రస్తుత ఇసుక పాలసీ లో మార్పులు చేర్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే సుక అక్రమంగా తరలి పోకుండా జీపీఎస్.. చెక్ పోస్టుల వద్ద పటిష్ట తనికీలకు చర్యలు చెప్పటింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version