ఆంధ్రప్రదేశ్లోని గర్భిణీ స్త్రీలకు అదిరిపోయే శుభవార్త చెప్పింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. నవ మాసాలు మోసి కన్న బిడ్డకు గ్రహణం మొర్రి, గుండెల్లో రంధ్రం, కాళ్లు మరియు చేతులు వంకరగా ఉండటం ఇలా వ్యాధులు ఉంటే ఆ తల్లి పడే బాధ అంతా ఇంతా కాదు. ఇలా ఏ తల్లి శోభకు గురికాకుండా చర్యలు తీసుకోవడంలో భాగంగా అత్యాధునిక టిఫా స్కానింగ్ సేవలను ఉచితంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది.
గర్భంలో ఉండగానే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యాన్ని మరియు పిండం ఎదుగుదలలో లోపాలను గుర్తించేందుకు టార్గెట్ ఇమేజింగ్ ఫర్ ఫీటల్ అనాలసిస్ స్కాన్ దోహదపడుతుంది. అయితే ఈ ఖరీదైన స్కాన్ ను వైయస్సార్ ఆరోగ్యశ్రీ పథకం కింద పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు చెందిన గర్భిణులకు ఉచితంగా చేస్తుంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అంటే ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా టిఫా, అల్ట్రా సౌండ్ స్కాన్ ఉచితంగా అందిస్తోంది. ఈ పరీక్షల ద్వారా గ్రహణం మొర్రి, గుండెలో రంధ్రం, కాళ్లు, చేతుల వంకరలు గుర్తించే వీలు ఉంటుంది.